మహిళల ఉచిత ప్రయాణానికి డిజిటల్ కార్డులు ప్రవేశపెట్టండి: ఆర్టీసీ ఎండీకి యూనియన్ వినతి

by Ramesh Naini |

బస్సుల్లో తెలంగాణ మహిళలను ఉచితంగా అనుమతించే మహాలక్ష్మి పథకం అమలులో ఆధార్ కార్డు ప్రామాణికతలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ (ఆర్టీసీ ఎస్.డబ్ల్యు.యూ) పేర్కొంది.

మహిళల ఉచిత ప్రయాణానికి డిజిటల్ కార్డులు ప్రవేశపెట్టండి: ఆర్టీసీ ఎండీకి యూనియన్ వినతి
X

దిశ, తెలంగాణ బ్యూరో: నిత్యం అన్ని పల్లెవెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సుల్లో తెలంగాణ మహిళలను ఉచితంగా అనుమతించే మహాలక్ష్మి పథకం అమలులో ఆధార్ కార్డు ప్రామాణికతలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ (ఆర్టీసీ ఎస్.డబ్ల్యు.యూ) పేర్కొంది. ఈ మేరకు సోమవారం బస్ భవన్ లో ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డిని కలిసి పలు సమస్యలపై యూనియన్ నేతలు వినతి పత్రాన్ని సమర్పించారు. ఆధార్ కార్డు ద్వారా మహిళలను ఉచితంగా అనుమతించే విధానం బదులుగా ప్రత్యేకంగా మహాలక్ష్మి డిజిటల్ కార్డును ప్రవేశపెట్టాలని ఆర్టీసీ ఎస్.డబ్ల్యు.యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొమిరెల్లి రాజిరెడ్డి విజ్ఞప్తి చేశారు. అలాగే కార్మికులకు 2021 వేతన సవరణ వర్తింప చేయాలని కోరారు. ఉద్యోగ భద్రత, పని భారం తగ్గింపు, వేధింపులు ఆపాలని, రిటైర్డ్ అయిన వారికి రావాల్సిన బకాయిలు చెల్లించాలన్నారు. విద్యుత్ బస్సుల పథకంలో మార్పులు చేసి ప్రైవేటుకు సబ్సిడీలో ఇచ్చే బదులుగా ఆ అవకాశం ఆర్టీసీలకు అప్పగించాలని కోరారు. ఉప్పల్ జోనల్ వర్క్ షాప్, మియాపూర్ బస్ బిల్డింగ్ యూనిట్ తరలింపు అడ్డుకోవాలని ఎండీకి విజ్ఞప్తి చేశారు.

Next Story