- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం.. కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు
బీజేపీ (BJP)లో బీఆర్ఎస్ (BRS) విలీనం అవుతుందంటూ కాంగ్రెస్ (Congress) నేతలు చేస్తున్న వ్యాఖ్యలకు బలం చేకూర్చుతూ.. ఇటీవలే ఎమ్మె్ల్సీ కవిత లేఖ సంచలనం సృష్టించింది.

దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ (BJP)లో బీఆర్ఎస్ (BRS) పార్టీ విలీనం అవుతుందంటూ కాంగ్రెస్ (Congress) నేతలు చేస్తున్న వ్యాఖ్యలకు బలం చేకూర్చుతూ.. ఇటీవలే ఎమ్మెల్సీ కవిత లేఖ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్ (KCR) బీజేపీపై మాట్లాడకపోవడం బిడ్డకు కోపం తెప్పించింది. ఈ నేపథ్యంలోనే బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనంపై కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ (Bhupathiraju Srinivasa Raju) ఫుల్ క్లారిటీ ఇచ్చారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ (Telangana)లో బీఆర్ఎస్ ప్రాముఖ్యత పూర్తిగా తగ్గిపోయిందని అన్నారు. ప్రస్తుతం బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బలమైన పార్టీలుగా నిలబడ్డాయని తెలిపారు. రాబోయే రోజుల్లో తెలంగాణ కూడా బీజేపీ హస్తగతం కాబోతోంది. ప్రభుత్వ ఏర్పాటు దిశగా కమలం పార్టీ వెళ్తుండటం శుభ పరిణామమని అన్నారు. మరో సంవత్సర కాలంలో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున బీజేపీలో చేరడం ఖాయమని జోస్యం చెప్పారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో పీఆర్పీ (PRP)లో విలీనం అయిందని గుర్తు చేశారు. రాజకీయ మనుగడ కోసం తీసుకునే నిర్ణయాలు ముందుగానే ఊహించలేమని, ఎదైనా సాధ్యమేనని.. చూస్తూ ఉండండని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు.






