Palasa : పలాస వాసులకు కేంద్ర మంతి రామ్మోహన్ నాయుడు గుడ్ న్యూస్

by Y. Venkata Narasimha Reddy |   (  Updated:2025-03-01 12:22:57  IST  )

పలాస పట్టణ వాసుల(People Of Palasa)కు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు(Union Minister Rammohan Naidu)గుడ్ న్యూస్(Good News) వెల్లడించారు.

Palasa : పలాస వాసులకు కేంద్ర మంతి రామ్మోహన్ నాయుడు గుడ్ న్యూస్
X

దిశ, వెబ్ డెస్క్ : పలాస పట్టణ వాసుల(People Of Palasa)కు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు(Union Minister Rammohan Naidu)గుడ్ న్యూస్(Good News) వెల్లడించారు. పలాస వాసులకు కీలకంగా మారిన ఆర్వోబీ(ROB) నిర్మాణం పెండింగ్ లో పడిపోవడంతో రైల్వే గేటు దాటడంలో ప్రజలు గంటల సమయం నిరీక్షించాల్సి వస్తుందన్నారు. దీంతో పలాస నగరానికి ఎంతో అవసరమైన రైల్వే ఆర్వోబీ వంతెన పనులకు సంబంధించి రూ.46.64 కోట్ల సవరించిన అంచనాలను కేంద్ర ప్రభుత్వం ఆమోదించిందని రామ్మోహన్ నాయుడు తెలిపారు.

ఆర్వోబీ పనులను పూర్తిగా రైల్వే శాఖ చేపట్టేలా పనులు పునః ప్రారంభం కాబోతున్నాయని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే శిరీషా, నేను పలుమార్లు ఢిల్లీలో రైల్వే మంత్రిని కలిసి చేసిన అభ్యర్థన మేరకు నిధుల మంజూరుకు కేంద్రం ఆమోదం తెలిపిందన్నారు. ఆర్వోబీ నిర్మాణాన్ని నాణ్యతతో త్వరగా పూర్తి చేస్తామని..ఈపెండింగ్ నిర్మాణ పనులకు నిధులు మంజూరు చేసిన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కు, రైల్వే శాఖకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, సీఎం నారా చంద్రబాబునాయుడు మార్గదర్శకత్వంతో శ్రీకాకుళం అభివృద్ధికి మరిన్ని ప్రాజెక్టులు తీసుకువచ్చి ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానని రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఏపీ అభివృద్ధికి కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందని..కొత్త ఎయిర్ పోర్టులు, రైల్వే ప్రాజెక్టులు, రహదారుల నిర్మాణాలు, విస్తరణ, పరిశ్రమల స్థాపన పెద్ధ ఎత్తున కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు.

Next Story