- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Kishan Reddy : మహాకుంభమేళాలో కేంద్రమంత్రి కిషన్రెడ్డి దంపతులు
ఉత్తరప్రదేశ్(UP) ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళా(PrayagRaj Mahakumbhmela)కు భక్తులు పోటెత్తుతున్నారు.

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్(UP) ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళా(PrayagRaj Mahakumbhmela)కు భక్తులు పోటెత్తుతున్నారు. జనవరి 13న ప్రారంభం అయిన మహాకుంభమేళా ఫిబ్రవరి 26న ముగియనుంది. ప్రపంచంలో అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం అయిన ఈ కుంభమేళాకు ఇప్పటి వరకు 53 కోట్లకు పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. సామాన్యులే కాకుండా దేశ విదేశాలకు చెందిన ప్రముఖులు కూడా కుంభమేళాలో పుణ్య స్నానాలు చేశారు. వీరిలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(President Droupdi Murmu), ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi), పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు, మంత్రులే కాకుండా ప్రపంచ కుబేరుడు ముఖేష్ అంబానీ(Mukhesh Ambani) వంటి వారు కూడా కుంభమేళా పాల్గొన్నారు.
తాజాగా ప్రయాగరాజ్ కుంభమేళా లో కేంద్ర మంత్రి కిషన్రెడ్డి(Kishan Reddy) దంపతులు కుటుంబ సమేతంగా పుణ్య స్నానమాచరించారు. మంగళవారం సాయంత్రం కుటుంబ సమేతంగా త్రివేణి సంగమంలో పవిత్రమైన కుంభమేళా లో స్నానం సరికొత్త ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించిందని కిషన్రెడ్డి పేర్కొన్నారు. ప్రయాగరాజ్ లో కోట్లాది మంది భక్తుల పుణ్యస్నానాలు.. సనాతన ధర్మం, మన సంస్కృతి, సంప్రదాయాలపై రోజురోజుకూ పెరుగుతున్న ఆదరణకు ఒక సజీవమైన ఉదాహరణ ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా.. దేశ ప్రజలందరికీ సుఖశాంతులు ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థించానని ఆయన తెలిపారు.






