అప్పుడు బలి దేవతన్న సోనియా.. ఇప్పుడు దేవత అయ్యిందా..? రేవంత్ సర్కార్‌పై కిషన్ రెడ్డి ఫైర్

by Satheesh |
అప్పుడు బలి దేవతన్న సోనియా.. ఇప్పుడు దేవత అయ్యిందా..? రేవంత్ సర్కార్‌పై కిషన్ రెడ్డి ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: జాన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. రాష్ట్రం ఏర్పడి పదేళ్లు అయిన నేపథ్యంలో ఈ వేడుకలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ప్రభుత్వం.. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్‌గా కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీని పిలవాలని నిర్ణయించింది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయంపై కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జూన్ 2వ తేదీన ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల కార్యక్రమానికి సోనియా గాంధీని పిలవడాన్ని తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు.

తెలంగాణ పాలిట సోనియా బలి దేవత అన్నా రేవంత్ రెడ్డికి.. ఇప్పుడు ఆమె దేవద అయ్యిందా అని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ కార్యక్రమైన ఆవిర్భావ దినోత్సవ వేడుకల ప్రొగామ్‌కు ఏ ప్రతిపాదికనా సోనియా గాంధీని పిలుస్తున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సోనియా గాంధీ వల్ల ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం రాలేదని, అమర వీరుల త్యాగాల వల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యిందన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో ఆలస్యం చేసి వందల మందిని ఉద్యమకారులను బలితీసుకున్న సోనియా గాంధీని.. ఆవిర్భావ దినోత్సం కార్యక్రమానికి పిలవడం ఏంటని కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు.

Next Story