బీజేపీ ఫుల్ సపోర్ట్ ఆర్టీసీ కార్మికులకే : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

by Naga Rani Yarlagadda |

తమ డిమాండ్లను పరిష్కరించాలని నిరసన చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు బీజేపీ పూర్తి మద్దతు ఇస్తుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.

బీజేపీ ఫుల్ సపోర్ట్ ఆర్టీసీ కార్మికులకే : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెకు బీజేపీ పూర్తి మద్దతును ఇస్తుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. గురువారం సికింద్రాబాద్ పరిధిలోని సీతాఫల్ మండిలో పర్యటించిన ఆయన.. స్థానికంగా ఉన్న అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించి అభివృద్ధి పనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికుల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడంలో ఇంతవరకూ ఒక్క అడుగు కూడా పడలేదని ఆరోపించారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందని గుర్తుచేశారు. చర్చల ద్వారా సమస్యను కొలిక్కి తెచ్చి సమ్మెను విరమింపజేయాలని ఆయన డిమాండ్ చేశారు.

ఇక..స్థానికంగా జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను పరిశీలించి, వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా 5,000కు పైగా అంగన్వాడీలను 'సాక్షం అంగన్వాడీలు'గా అప్‌గ్రేడ్ చేస్తున్నామని, వీటిలో ఎల్‌ఈడీ స్క్రీన్లు, వాటర్ ఫిల్టర్లు వంటి ఆధునిక వసతులు కల్పిస్తున్నామని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు.

మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా రెండోరోజు ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. రాణిగంజ్ డిపోల ముందు కార్మికులు ధర్నా చేపట్టగా.. BRTU, BRSV నాయకులు పాల్గొని వారికి మద్దతు తెలిపారు. డిపోల నుంచి వెళ్తున్న ప్రైవేటు బస్సుల్ని అడ్డుకున్నారు.

Next Story