- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Flash: కేంద్రమంత్రి బండి సంజయ్ తల్లికి గుండెపోటు
కేంద్రమంత్రి బండి సంజయ్ తల్లి శకుంతలమ్మకు అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. దీంతో ఆమెను హైదరాబాద్ గచ్చిబౌలి ఆస్పత్రికి తరలించారు.

దిశ, వెబ్‌డెస్క్ : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ తల్లి శకుంతలమ్మ హఠాత్తుగా గుండెపోటుకు గురయ్యారు. దీంతో హుటాహుటిన ఆమెను హైదరాబాద్ కు తరలించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమెకు గచ్చిబౌలిలోని మెడికవర్ ఆస్పత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. శకుంతలమ్మకు గుండెపోటు రావడంతో మెడికవర్ ఆసుపత్రికి చెందిన నిపుణులైన కార్డియాలజిస్టుల బృందం వెంటనే రంగంలోకి దిగింది. ఆమెకు అత్యవసరంగా వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం, గుండెకు స్టంట్ వేసి (Angioplasty) చికిత్స అందించినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆమెను ఐసీయూలో ఉంచి వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
తల్లి అనారోగ్య వార్త తెలిసిన వెంటనే కేంద్ర మంత్రి బండి సంజయ్ తన కార్యక్రమాలను రద్దు చేసుకుని నేరుగా గచ్చిబౌలిలోని మెడికవర్ ఆసుపత్రికి చేరుకున్నారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న తన తల్లి శకుంతలమ్మను ఆయన పరామర్శించారు. అనంతరం ఆమెకు అందిస్తున్న వైద్య సేవలు, ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై మెడికవర్ ఆసుపత్రి వైద్యులను అడిగి ఆరా తీశారు. శకుంతలమ్మ త్వరగా కోలుకోవాలని బండి సంజయ్ అభిమానులు, బీజేపీ శ్రేణులు ఆకాంక్షిస్తున్నారు.






