ముందు హైదరాబాద్ పేరును మార్చండి.. బండి సంజయ్ ఆసక్తికర ట్వీట్

by Ramesh Naini |

హైదరాబాద్‌ను తిరిగి ‘భాగ్యనగరం’గా పేరు మార్చాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు.

ముందు హైదరాబాద్ పేరును మార్చండి.. బండి సంజయ్ ఆసక్తికర ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్‌ను తిరిగి ‘భాగ్యనగరం’గా పేరు మార్చాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లో పలు రోడ్లకు ప్రముఖుల పేర్లు పెట్టాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న పేరు మార్పులపై ఆయన స్పందించారు. ఆదివారం బండి సంజయ్ తన ట్వీట్‌లో, ప్రభుత్వం పేరు మార్పుల పట్ల ఆసక్తి చూపుతున్నట్లయితే, చారిత్రక నేపథ్యం ఉన్న హైదరాబాద్ పేరునే ప్రథమంగా మార్చాలని అభిప్రాయపడ్డారు.

‘ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఉన్నామో చూడండి, ఒక వైపు #TwitterTillu ట్విట్టర్ టిల్లు సజీవంగా ఉన్న కేసీఆర్ AI విగ్రహాలను తయారు చేయడంలో బిజీగా ఉన్నారు. మరో వైపు రేవంత్ రెడ్డి ఎవరు ట్రెండ్‌లో ఉంటే వారిపేర్లు పెడుతున్నాడు. నిజంగా బయటకు వచ్చి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ, ప్రజా సమస్యలను మహాధర్నా ద్వారా తీసుకుని వెళ్లే ఏకైక పార్టీ BJP మాత్రమే’ అని బండి సంజయ్ పేర్కొన్నారు. కాగా, ఫ్యూచర్ సిటీ ప్రధాన రహదారికి రతన్ టాటా పేరు, US కాన్సులేట్‌ రోడ్డుకు ప్రెసిడెంట్ ట్రంప్ ఎవెన్యూగా పేరు, గూగుల్ స్ట్రీట్ పేరుతో మరో రహదారి, మైక్రోసాఫ్ట్, విప్రో జంక్షన్ల పేర్లతో మరికొన్ని రహదార్లకు పేరు పెట్టాలని రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ట్వీట్ ఇదే..

Next Story