Gandhi Bhavan: గాంధీ భవన్ వద్ద నిరుద్యోగుల నిరసన

by Prasad Jukanti |

పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ను కలిసేందుకు నిరుద్యోగులు ప్రయత్నించారు.

Gandhi Bhavan: గాంధీ భవన్ వద్ద నిరుద్యోగుల నిరసన
X

దిశ, డైనమిక్ బ్యూరో: నాంపల్లిలోని గాంధీ భవన్ (Gandhi Bhavan) ఎదుట నిరుద్యోగులు (unemployment youth protest) ఆందోళనకు దిగారు. విద్యుత్ శాఖలోని ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం నిరసనకు దిగారు. గాంధీ భవన్ లో పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (PCC chief Mahesh kumar Goud) ను కలిసేందుకు ప్రయత్నించారు. 2024 అక్టోబర్ లో నోటిఫికేషన్ ఇస్తామని ఇచ్చిన హామీ ఏమైనందని ప్రశ్నించారు. 2018 నుంచి ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల కాలేదని ప్రస్తుతం 5 వేలకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయని అన్నారు. వెంటనే విద్యుత్ సంస్థల్లో ఏఈ, ఎస్ఈ, జేఐఎం పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేయాలని ప్లెక్సీలు, ఫ్లకార్డులు పట్టుకుని నిరసనకు దిగారు.

Next Story