- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Protest: సెక్రటేరియట్ ముట్టడికి యత్నించిన నిరుద్యోగులు.. ఈడ్చుకెళ్లి మరీ అరెస్ట్‌లు!
తెలంగాణ సెక్రటేరియట్ (Telangana Secretariat) వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ సెక్రటేరియట్ (Telangana Secretariat) వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 2 లక్షల ఉద్యోగాల భర్తీ, జాబ్ క్యాలెండర్ విడుదల, మెగా డీఎస్సీ ప్రకటించాలని శుక్రవారం సచివాలయం ముట్టడికి (Unemployed people) నిరుద్యోగులు యత్నించారు. అప్పటికే భారీగా మోహరించిన పోలీసులు ర్యాలీగా వస్తున్న పలువురు నిరుద్యోగులను అడ్డుకోని.. ఈడ్చుకెళ్లి మరీ పోలీసు వాహనాల్లో స్థానిక స్టేషన్లకు తరలించారు. అలాగే డీవైఎఫ్ఐ (DYFI) ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో సచివాలయం ముట్టడికి యత్నించారు. ర్యాలీగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ ముట్టడికి యత్నించారు. అన్ని ఉద్యోగాల నోటిఫికేషన్‌లు విడుదల చేయాలని డీవైఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు.
నిరుద్యోగ భృతి రూ.4వేలు ఇవ్వాలని, జాబ్ క్యాలెండర్‌ను అమలు చేసి.. ఉద్యోగ నోటిఫికేషన్స్ ఇవ్వాలని, రాజీవ్ యువ వికాస్ పథకాన్ని అమలు చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీల అమలుకై ఛలో సెక్రటేరియట్ కార్యక్రమానికి మాజీ మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే వివిధ విద్యార్థి, యువజన, నిరుద్యోగ సంఘాలు ఇవాళ ముట్టడికి సిద్ధమయ్యాయి. అయితే నిన్నటి నుంచే నిరుద్యోగులను పోలీసులు ముందుస్తు అరెస్ట్‌లు చేశారు. కాగా, ముట్టడి నేపథ్యంలో ఉదయం నుంచే సచివాలయం పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసులు మోహరించారు.






