- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణలో మొత్తం 395 గ్రామాల్లో ఏకగ్రీవం
తెలంగాణలో మొత్తం 395 గ్రామాల్లో ఏకగ్రీవం

దిశ, వెబ్‌డెస్క్: గ్రామ పంచాయతీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. మొదటి విడత, రెండో విడత నామినేషన్లు పూర్తి కావడం, మూడో విడత నామినేషన్లు ప్రారంభం కావడంతో గ్రామాల్లో ఎన్నికల వేడి రాజుకుంది. నామినేషన్లు ఒక వైపు, నామినేషన్వేసిన వారిని బరిలో నుంచి తప్పించే పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఫలానా అభ్యర్థి బరిలో ఉంటే తమ గెలుపు ఓటములపై ప్రభావం చూపుతుందని గుర్తించిన కొందరు.. ప్రత్యర్థి అభ్యర్థులను బరిలో నుంచి తప్పించే పనిలో నిమగ్నమయ్యారు. అందుకోసం బుజ్జగింపులు, బేరసారాలు చేస్తున్నారు. అప్పటికీ వినకుంటే బెదిరింపులకు దిగుతున్నారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా అభ్యర్థులను బరిలో నుంచి తప్పించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రధానంగా బరిలో నిలిచిన అభ్యర్థి సామాజిక సమీకరణాలు, ఓట్లు విడిపోతే నష్టపోతామని ఎదుటి వారికి అర్థం అయ్యేలా చెబుతూ తమ లక్ష్యాన్ని వివరిస్తున్నారు. తాము రాజకీయంగా, సామాజికవర్గాల వారీగా నష్టపోతామని, రాక రాక రిజర్వేషన్ ఇప్పుడే తమకు అనుకూలంగా వచ్చిందని, రెండు దశాబ్దాల తన రాజకీయ జీవితంలో ఇది ఒక్కటే అవకాశమంటూ నామినేషన్వేసిన వారు విత్ డ్రా చేసుకోవాలని వేడుకుంటున్నారు.
మరోవైపు.. రాష్ట్రంలో ఏకగ్రీవాలు కూడా భారీ స్థాయిలోనే జరుగుతున్నాయి. ఇప్పటివరకు తెలంగాణలో తొలివిడత ఎన్నికల్లో 395 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. అత్యధికంగా వికారాబాద్ జిల్లాలో 39 గ్రామాలు, ఆదిలాబాద్ జిల్లాలో 33 గ్రామాల్లో ఏకగ్రీవం అయ్యాయి. మరోవైపు రాష్ట్రంలో ఇప్పటిరవరకు 9331 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి.






