స్కూళ్లకు మరో రెండు రోజులు సెలవు.. ప్రకటించిన విద్యా శాఖ

by Kema Shiva Kumar |

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ద్రోణి ప్రభావం వల్ల రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి.

స్కూళ్లకు మరో రెండు రోజులు సెలవు.. ప్రకటించిన విద్యా శాఖ
X

దిశ, వెబ్‌డెస్క్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ద్రోణి ప్రభావం వల్ల రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే నేడు అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. గత రెండు రోజుల నుంచి కామారెడ్డి, మెదక్‌ను వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఈ పరిణామంతో ఎక్కడక్కడ వరద నీరు భూమిని కమ్మేసింది. ఇక జాతీయ రహదారులతో పాటు రైల్వే ట్రాక్ సైతం కొట్టుకుపోయిని ప్రజా రవాణా వ్యవస్థ స్తంభించింది.

కాగా, భారీ వర్షాల నేపథ్యంలో తాజాగా కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా విద్యా సంస్థలకు మరో రెండు రోజుల పాటు విద్యాశాఖ సెలవు ప్రకటించింది. అయితే, ఆగస్టులో సాధారణ వర్షపాతం కంటే 135 శాతం అధికంగా వర్షం కురిసిందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. రాజంపేట, భిక్కనూరు, నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి, లింగంపేట, కామారెడ్డి, భిక్కనూరు, దోమకొండ, నిజాంసాగర్, తాడ్వాయి, రామారెడ్డి, సదాశివ నగర్, పాల్వంచ, మాచారెడ్డి, పిట్లం, గాంధారి ప్రాంతాల్లో రెండు రోజుల్లో 30 నుంచి 60 సెంటీ మీటర్ల రికార్డు వర్షపాతం నమోదైంది.

Next Story