తెలంగాణలో పెట్టుబడులకు ముందుకు వచ్చిన మరో రెండు సంస్థలు

by Disha Web Desk 19 |
తెలంగాణలో పెట్టుబడులకు ముందుకు వచ్చిన మరో రెండు సంస్థలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటనలో రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. ఐటీ అనుబంధ సేవా రంగంలో హైదరాబాద్‌లో తమ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు బెయిన్‌ క్యాపిటల్‌ గ్రూప్‌నకు చెందిన వీఎక్స్‌ఐ గ్లోబల్‌ సొల్యూషన్స్‌ ప్రకటించింది. ఈ మేరకు మంత్రి కేటీఆర్‌తో సంస్థ చీఫ్‌ హ్యూమన్‌ రిసోర్సెస్‌ ఆఫీసర్‌ ఎరికా బోగర్‌కింగ్‌ సమావేశం అయ్యారు. అనంతరం నగరంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తితో ఉన్నట్లు వెల్లడించారు. దీని ద్వారా 10 వేల మందికి ఉద్యోగ అవకాశాలు దక్కనున్నాయి. వీఎక్స్‌ఐ గ్లోబల్‌ సొల్యూషన్స్‌ ప్రపంచవ్యాప్తంగా 42 దేశాల్లో సేవలు అందిస్తున్నది.

మండీ హోల్డింగ్స్ ఆసక్తి:

రాష్ట్రంలో టెక్నాలజీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేసేందుకు మండీ హోల్డింగ్స్ ముందుకు వచ్చింది. హూస్టన్‌లో మంత్రి కేటీఆర్‌తో మండి హోల్డింగ్స్‌ వ్యవస్థాపక చైర్మన్‌, సీఈవో ప్రసాద్‌ గుండుమోగుల సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌ టెక్నాలజీ సెంటర్‌ ఏర్పాటుకు ముందుకొచ్చారు. దీనిద్వారా 2 వేల మందికి ఉద్యోగ అవకాశాలు దక్కనున్నాయి. ఈ సంస్థలు హైదరాబాద్‌కు రావడంపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు.

Also Read...

కేసీఆర్‌ను వాళ్లు నమ్మడం లేదా..? కొత్త చర్చకు తెరలేపిన కర్నాటక CM ప్రమాణాస్వీకారోత్సవ కార్యక్రమం


Next Story

Most Viewed