- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Tummala: టైంకు రాని అధికారులు.. మంత్రి తుమ్మల ఆకస్మిక తనిఖీలో షాకింగ్ విషయాలు
సమయ పాలన పాటించని అధికారులపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషి కొంత మంది అధికారుల నిర్లక్ష్యం మూలంగా నీరుగారిపోతున్నది. తాజాగా సమయ పాలన పాటించని అధికారుల బాగోతం బట్టబయలైంది. అలాంటి వారిపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Tummala Nageswara Rao) సీరియస్ అయ్యారు. హైదరాబాద్ మార్కెటింగ్ శాఖ ప్రధాన కార్యాలయాన్ని మంత్రి ఆకస్మిక తనిఖీ చేశారు. అయితే మంత్రి వచ్చే సమయానికి చాలా మంది అధికారులు ఆఫీసుకు రాలేదు. దీంతో సమయానికి కార్యాలయానికి రాని ఉద్యోగులకు మెమోలు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. ఆఫీస్ లో వెంటనే ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్ కోసం అవసరమైన బయోమెట్రిక్ పరికరాలు ఏర్పాటు చేయాలన్నారు.
సచివాలయంలో ఇప్పటికే అమలు:
రాష్ట్ర సచివాలయంలోనూ ఉద్యోగులు సమయపాలన పాటించకపోవడం గతంలో చర్చనీయాంశం అయింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మంత్రులు చేపట్టిన ఆకస్మిక తనిఖీల్లో అధికారుల నిర్లక్ష్య ధోరణి బయటపడింది. దీంతో ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులందరికీ ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ విధానాన్ని గతేడాది డిసెంబర్ నుంచి అమల్లోకి తీసుకువచ్చింది. సచివాలయంలో పని చేసే అన్ని శాఖల అధికారులు, సిబ్బందికి ఫేషియల్ రికగ్నిషన్ విధానంలోనే అటెండెన్స్ వివరాలు స్వీకరిస్తున్నారు. ఔట్ సోర్సింగ్, సచివాలయం హెడ్ నుంచి వేతనాలు పొందే ప్రతి ఉద్యోగికి ఈ విధానం వర్తింపజేస్తున్నారు. ఇందుకోసం సచివాలయంలో మొత్తం 60కి పైగా యంత్రాలను ఏర్పాటు చేశారు. కాగా ఈ విధానం రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల్లో అమలు చేయాలని ప్రజలు కోరుతున్నారు.






