- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ వాసులకు గుడ్ న్యూస్.. TTD కొత్త మార్గదర్శకాలు
తెలంగాణ వాసులకు తిరుమల దర్శనానికి సులభతరం కోసం టీటీడీ అధికారులు కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. భక్తులకు మరింత సులభతరంగా దర్శనం పొందే విధంగా చర్యలు తీసుకుంది.

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ వాసులకు తిరుమల దర్శనానికి సులభతరం కోసం టీటీడీ అధికారులు కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. భక్తులకు మరింత సులభతరంగా దర్శనం పొందే విధంగా చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి కార్యాలయం ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన పోర్టల్ (https://cmottd.telangana.gov.in/) ద్వారా భక్తులకు సిఫారసు లేఖలను జారీ చేయాలని సూచించారు. అలాగే.. భక్తుల వివరాలను ప్రజాప్రతినిధులు ఈ పోర్టల్‌లో నమోదు చేయాలని, నమోదు చేసిన వివరాల ఆధారంగా సిఫారసు లేఖను ఇవ్వాలని సూచించారు. సంతకం కోసం లేఖను డౌన్‌లోడ్ చేసి ప్రింట్ చేయాలని, సంతకం అనంతరం స్కాన్ చేసి తిరిగి పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలని పేర్కొన్నారు.
అప్‌లోడ్ చేసిన వెంటనే భక్తులకు, టీటీడీ అధికారులకు వాట్సాప్ ద్వారా సమాచారం అందుతుందని, సిఫారసు లేఖలు సోమవారం నుంచి గురువారం వరకు మాత్రమే జారీ చేయాలని సూచించారు. బ్రేక్ దర్శనాలు సోమవారం, మంగళవారం మాత్రమే ఉంటాయని, ప్రత్యేక ప్రవేశ దర్శనం బుధవారం, గురువారం మాత్రమే ఉంటుందని, కానీ వసతి ఉండదని పేర్కొన్నారు. భక్తులు ఆధార్ కార్డు తప్పనిసరిగా తీసుకురావాలని, చిన్న పిల్లలకు బర్త్ సర్టిఫికేట్ ఉన్నా సరిపోతుందని తెలిపారు. అలాగే.. టీటీడీ సూచించిన డ్రెస్ కోడ్ పాటించాలని పేర్కొన్నారు.






