TSPSC: గ్రూపు-2 పరీక్షల తేదీలు ఖరారు

by Disha Web Desk 2 |
TSPSC: గ్రూపు-2 పరీక్షల తేదీలు ఖరారు
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో భర్తీ చేయనున్న గ్రూప్ 2 పోస్టుల పరీక్షల తేదీలను తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఖరారు చేసింది. ఆగస్టు 29, 30 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. పరీక్షకు వారం ముందు నుంచి మాత్రమే హాల్ టికెట్లను అఫీషియల్ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 783 పోస్టుల భర్తీకి గతేడాది డిసెంబర్‌ 29న టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. గ్రూప్‌-2 ఉద్యోగాల కోసం 5,51,943 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో పోస్టుకు 705 మంది పోటీ పడుతున్నారు. ఇదివరకే గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు, గ్రూప్ 4 పరీక్షల తేదీలను బోర్డు ప్రకటించింది. జూన్ 5 నుంచి గ్రూప్ 1 మెయిన్స్, జులై 1న గ్రూప్ 4 పరీక్షలు నిర్వహించనున్నారు.

Next Story

Most Viewed