వాట్ ఏ ఫ్యాన్సీ.. రవాణాశాఖకు భారీగా ఆదాయం

by Naga Rani Yarlagadda |

ఫ్యాన్సీ నంబర్లకు ఉన్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. లక్కీ నంబర్ లేదా న్యూమరాలజీ ప్రకారం తమకు నచ్చిన నంబర్‌ను ఎంచుకోవాలని కొందరు ఎగబడుతుంటారు.

వాట్ ఏ ఫ్యాన్సీ.. రవాణాశాఖకు భారీగా ఆదాయం
X
  • ఫ్యాన్సీ నంబర్లకు లక్షల రూపాయలు వసూల్
  • ఆర్టీఏకి ఏకంగా రూ.65,38,889 రాబడి

దిశ, తెలంగాణ బ్యూరో: ఫ్యాన్సీ నంబర్లకు ఉన్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. లక్కీ నంబర్ లేదా న్యూమరాలజీ ప్రకారం తమకు నచ్చిన నంబర్‌ను ఎంచుకోవాలని కొందరు ఎగబడుతుంటారు. ఫ్యాన్సీ నంబర్ కైవసం చేసుకుని అందరికంటే ప్రత్యేకంగా నిలబడాలని కోరుకుంటారు. ఇందుకోసం ఎంత ఖర్చయినా చెల్లించేందుకు వెనుకాడరు. అలాంటి వారి కోసమే రవాణా శాఖ (ఆర్టీఏ) వేలం పాటలు నిర్వహిస్తుంటుంది. ఇందులో భాగంగానే పలు ఫ్యాన్సీ నంబర్ల కోసం రూ. లక్షల్లో వెచ్చించి కొనుగోలు చేయడం సర్వసాధారణంగా మారింది. తాజాగా శుక్రవారం ఆర్టీఏ ఖైరతాబాద్ కార్యాలయంలో నిర్వహించిన వేలంలో లక్షలు చెల్లించి ఫ్యాన్సీ నంబర్లు అత్యధిక ధరకు దక్కించుకున్నారు. వేలంలో ఫ్యాన్సీ నంబర్లు భారీ మొత్తానికి ధర పలికాయి. 11 నంబర్ల కోసం జరిగిన వేలంలో రూ.65,38,889 చెల్లించి మరీ వారికి కావాల్సిన నంబర్లను కైవసం చేసుకున్నారు. పలువురు ప్రముఖులు, కార్పొరేట్ సంస్థలు పోటీ పడి తమకు నచ్చిన నంబర్లను దక్కించుకున్నారు. టీజీ09హెచ్9999 నంబర్ కోసం హానర్ ప్రైమ్ హౌసింగ్ ఎల్ఎల్పీ అనే కంపెనీ ఏకంగా రూ. 2272222 లక్షల వేలం పాట పాడి కైవసం చేసుకుంది. ఇక టీజీ09జే0009 నంబర్ ను మెస్సర్స్ దండు ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ రూ. 680000కు దక్కించుకుంది.

ఫ్యాన్సీ నంబర్ల వేలం వివరాలు..

టీజీ09హెచ్9999- రూ.22,72,222 హానర్ ప్రైమ్ హౌసింగ్ ఎల్ఎల్పీ

టీజీ09జె0009- రూ.6,80,000 (డండు ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్)

టీజీ09జె0006- రూ.5,70,666 (సాయి సిల్క్స్ కలామందిర్ లిమిటెడ్)

టీజీ09జె0099- రూ.3,40,000 (గోదావరి ఫార్చూన్)

టీజీ09జె0001- రూ.2,60,000 (శ్రీనిధి ఐటీ స్పేసెస్ ప్రైవేట్ లిమిటెడ్)

టీజీ09జె0005- రూ.2,40,100 (నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్)

టీజీ09జె0018- రూ.1,71,189 (రోహిత్ రెడ్డి ముత్తు)

టీజీ09జె0007- రూ.1,69,002 (శ్రీనివాస్ నాయుడు కుందవరపు)

టీజీ09జె0077- రూ.1,41,789 (మీనాక్షి పవర్ ప్రైవేట్ లిమిటెడ్)

టీజీ09జె0123- రూ.1,19,999 (అకుల మాధురి)

టీజీ09జె0003- రూ.1,15,121 (జీఎస్‌ఆర్ కన్స్ట్రక్షన్స్)

మొత్తం బిడ్ అమౌంట్- రూ. 65,38,889

Next Story