- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Seethakka: ఇకపై టీచర్లకు ఏడాదికి రెండు సార్లు శిక్షణ: మంత్రి సీతక్క
ఉపాధ్యాయులకు శిక్షణపై మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: ఆదివాసీ గిరిజన విద్యార్థులు తమ ప్రత్యేకతను కాపాడుకోవాలని మంత్రి సీతక్క (seethakka) సూచించారు. మన ప్రత్యేకతను కోల్పోతే మన అస్తిత్వం కనుమరుగవుతుంది అదే జరిగితే మన అభివృద్ధిని ఎవరూ పట్టించుకోరని చెప్పారు. ఆదివాసీ గిరిజనులు తమ అస్తిత్వాన్ని పరిరక్షించుకోవాలని విద్యాసంస్థల్లో ఎస్టీల ప్రత్యేక సంస్కృతిని కాపాడాలన్నారు. ఆదివాసీ గిరిజనులో సాంస్కృతిక మార్పు జరగ కూడదని గిరిజన విద్యాసంస్థల్లో బోధిస్తున్న ఇతర వర్గాల టీచర్లు తమ సంస్కృతి సాంప్రదాయాలను గిరిజన విద్యార్థుల మీద రుద్ద వద్దని చెప్పారు. చదువుతోపాటు ఆదివాసి గిరిజన సంప్రదాయాలు నేర్పించాలని సూచించారు. ఇవాళ బంజారాహిల్స్ లోని కొమురం భీం ఆదివాసి భవన్ లో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అకడమిక్ సక్సెస్ మీట్ (academic success meet)- 2025 కార్యక్రమానికి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా టెన్త్, ఇంటర్, ఎంసెట్, జేఈ మెయిన్స్ లో ప్రతిభ కనబరిచిన గిరిజన విద్యా సంస్థల విద్యార్థులను సన్మానించారు. చదువులో సత్తా చాటిన గిరిజన విద్యార్థులకు, గిరిజన విద్యా సంస్థల సిబ్బందికి మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.
టీచర్లకు ఏడాదికి రెండు సార్లు శిక్షణ:
విద్యకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని 8 ఏళ్ల తర్వాత డైట్ ఛార్జీలు, పదహారేళ్ల తర్వాత కాస్మొటిక్ ఛార్జీలు పెంచినట్లు చెప్పారు. ఎస్టీ విద్యార్థులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని అందుకే గిరిజన విద్యా సంస్థల్లో ఉత్తీర్ణత శాతం పెరుగుతోందన్నారు. వచ్చే ఏడాది మరింత మెరుగైన ఫలితాలు సాధించాలన్నారు. ఈ ఏడాది నుంచి ఏడాదికి 2 సార్లు టీచర్స్ కు శిక్షణ ఇవ్వనున్నామని పాఠశాలలు ప్రారంభమయ్యే సమయంలో ఒక దఫా దసరా సంక్రాంతి మధ్యలో రెండో దఫా ట్రైనింగ్ ఇస్తామని వెల్లడించారు.
బీఆర్ఎస్ పాలనలో ఐటీడీఏలు నిర్వీర్యం:
2014 వరకు మన జాతుల మీద, గిరిజన సంస్కృతి మీద పరిశోధన జరిగిందని గత పది సంవత్సరాల్లో మన సంస్కృతిపై అధ్యయన పరిశోధనలు తగ్గిపోయాన్నారు. బీఆర్ఎస్ పాలనలో ఐటీడీఏలు నిర్వీర్యం అయ్యాయని వీటిని తిరిగి బలోపేతం చేయాలని సీఎం సూచించారన్నారు. పది, ఇంటర్ తరువాత స్టూడెంట్స్ గైడెన్స్ దొరకట్లేదని సరైనా మర్గదర్శతక్వం అవసరం అన్నారు. మనల్ని మనం గౌరవం వించుకోవాలనే మొదటిసారిగా ప్రతిభా పురస్కార కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని ప్రతిభా పురస్కారాలు అందుకోలేక పోయిన విద్యార్థులు మరింత పట్టుదలతో చదవాలని సూచించారు. ట్రైబల్ అని చెప్పుకుంటే సమాజంలో చిన్న చూపు చూస్తారనే భయం ఇప్పటి విద్యార్థులుల్సలో ఉందని అయితే వీటికి భయపడాల్సిన అవసరం లేదన్నారు. మన జాతుల నుంచి ఐఏఎస్, ఐపీఎస్, ఎమ్మెల్యేలు, మంత్రులు ఉన్నారని చెప్పారు. మనం ఎవరికీ తక్కువ కాదని తెలిపారు.






