‘ఆ చలాన్లు ఏంటి బ్రో’.. పోలీసులే కాదు ఎవరైనా షాక్ అవ్వాల్సిందే!

by Gantepaka Srikanth |

ట్రాఫిక్ రూల్స్ పాటించని వాహనదారులకు పోలీసులు చలాన్లు

‘ఆ చలాన్లు ఏంటి బ్రో’.. పోలీసులే కాదు ఎవరైనా షాక్ అవ్వాల్సిందే!
X

దిశ, బ్యూరో కరీంనగర్: ట్రాఫిక్ రూల్స్ పాటించని వాహనదారులకు పోలీసులు చలాన్లు వేయడం కామన్. హెల్మెట్ పెట్టుకోకపోయినా, ట్రిపుల్ రైడింగ్ చేసినా, సిగ్నల్ జంప్ చేసినా, డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినా, లైసెన్స్ లేకపోయినా, మైనర్లు వాహనం నడిచినా ఫైన్లు వేస్తారు. అయితే ఎవరైనా వెయ్యి, రెండు వేలు, మహా అయితే ఓ పదివేల ఫైన్లు ఉండటం చూశాం. కానీ కరీంనగర్‌లో ఏకంగా ఓ వాహనం(AP 10 G 8764 బజాజ్ చెతక్)పై ఏకంగా రూ.28 వేలకు పైగా చలాన్లు పడ్డాయి. సమాచార హక్కు చట్టం ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ చలాన్ల ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Next Story