జీవో 190ని పూర్తిగా అమలు చేయాలి.. సీఎస్ రామక్రుష్ణారావును కోరిన టీపీయూఎస్

by Ajay Maddhiboyina |

రాష్ట్రంలో 317 జీవో బాధిత ఉపాధ్యాయులకు ఉపశమనం కలిగేలా ఇచ్చిన జీవో 190 ని పూర్తిస్థాయిలో అమలు చేయాలని టీపీయూఎస్ ప్రభుత్వాన్ని కోరింది.

జీవో 190ని పూర్తిగా అమలు చేయాలి.. సీఎస్ రామక్రుష్ణారావును కోరిన టీపీయూఎస్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో 317 జీవో బాధిత ఉపాధ్యాయులకు ఉపశమనం కలిగేలా ఇచ్చిన జీవో 190 ని పూర్తిస్థాయిలో అమలు చేయాలని టీపీయూఎస్ ప్రభుత్వాన్ని కోరింది. టీపీయూఎస్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వొద్నాల రాజశేఖర్, తెల్కలపల్లి పెంటయ్య, ఆర్గనైజింగ్ సెక్రటరీ హన్మంత్ రావులు గురువారం సచివాలయంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు గారిని కలిసి వినతి పత్రం సమర్పించారు. జీవో 25 తో ముడిపెట్టకుండా ఆ జీవో ను ప్రత్యేకంగా అమలు చేయాలని పేర్కొన్నారు. 317 జీవో బాధిత ఉపాధ్యాయులకు తాత్కాలిక ఉపశమనం కోసం ప్రభుత్వం చేసిన 190 జీవో ను వెంటనే అమలు పరచాలని కోరారు. స్థానికతను కోల్పోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ఉపాధ్యాయుల పట్ల ప్రభుత్వం సానుకూల నిర్ణయం త్వరగా తీసుకోవాలని తెలిపారు.

Next Story