- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రేపు హైదరాబాద్‌లో, ఎల్లుండి జిల్లాల్లో టీపీసీసీ నిరసనలు.. ఎందుకంటే?
రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాలని ఏఐసీసీ పిలుపునిచ్చిన నేపథ్యంలో టీపీసీసీ కార్యాచరణను ప్రకటించింది.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: జాతీయ ఉపాధి హామీ చట్టం పథకంలో మహాత్మా గాంధీ పేరును తొలగించి ‘వికసిత్ భారత్ జి.రామ్.జి’ పేరిట కొత్త పథకాన్ని తీసుకురావాలని బీజేపీ చేస్తున్న ప్రయత్నాలను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాలని ఏఐసీసీ పిలుపునిచ్చిన నేపథ్యంలో టీపీసీసీ కార్యాచరణను ప్రకటించింది. ఈ మేరకు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
శనివారం ఉదయం 10 గంటలకు సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రి సమీపంలో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం వద్ద టీపీసీసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ చిత్రాలు, గాంధీపై పాటలతో బీజేపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రదర్శన చేపడతామని వెల్లడించారు. అదేవిధంగా ఆదివారం నాడు జిల్లాల కేంద్రాల్లో కూడా ఇదే తరహా నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు టీపీసీసీ పేర్కొంది. గాంధీ పేరును తొలగించే కుట్రలను ప్రజలు గుర్తించి వ్యతిరేకించాలని కాంగ్రెస్ పార్టీ కోరింది.






