- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పదేళ్లలో జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ చేసిందేమిటి? : సామ రామ్మోహన్ రెడ్డి
పదేండ్లలో జూబ్లీహిల్స్ కోసం బీఆర్ఎస్ చేసిందేంటి?.. బీఆర్ఎస్ చేసిందేమీ లేకనే కేటీఆర్ బుల్డోజర్ అంటూ కొత్త నాటకం ఆడుతున్నారని టీపీసీసీ మీడియా అండ్ కమ్యూనికేషన్స్ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి మండిపడ్డారు.

- ఏమీ లేకనే కేటీఆర్ బుల్డోజర్ నాటకం
- ఆయనే బుల్డోజర్ కి పర్యాయ పదం
- టీపీసీసీ మీడియా అండ్ కమ్యూనికేషన్స్ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి
దిశ, తెలంగాణ బ్యూరో : పదేండ్లలో జూబ్లీహిల్స్ కోసం బీఆర్ఎస్ చేసిందేంటి?.. బీఆర్ఎస్ చేసిందేమీ లేకనే కేటీఆర్ బుల్డోజర్ అంటూ కొత్త నాటకం ఆడుతున్నారని టీపీసీసీ మీడియా అండ్ కమ్యూనికేషన్స్ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టును కూలగొట్టిన బుల్డోజర్ ఎవరిదో కేటీఆర్ చెప్పాలని, కేటీఆర్, కేసిఆర్ ముస్లింలపై మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. బుధవారం గాంధీభవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో రామ్మోహన్రెడ్డి మాట్లాడుతూ తమ హయాంలో అడ్డగోలు కబ్జాలతో హైదరాబాద్ నగరం మునిగిపోయే ప్రమాదాన్ని ఎదుర్కొన్నదని, హైడ్రాతో కబ్జాలను అడ్డుకోవడం వల్లే హైదరాబాద్లో వరదలు తగ్గాయన్నారు. పేద ప్రజల ఇండ్లలోకి నీళ్ళు రాకుండా సంతోషంగా ఉంటే బీఆర్ఎస్ ఓర్వలేకపోతుందని, బుల్డోజర్ పర్యాయపదం కేటీఆర్ అని, ఆయన తెలంగాణ సంపదను లూటి చేసిన బుల్డోజర్ అని రామ్మోహన్ రెడ్డి ఆగ్రహాం వ్యక్తం చేశారు. సిరిసిల్ల నియోజకవర్గం లోని నేరళ్లలో దళితులను ఇసుక లారీలకి తో తొక్కించారని, మైన్స్, వైన్స్, సాండ్, ల్యాండ్ మాఫియాని నడిపించారని ఆయన ఆరోపణలు గుప్పించారు. ధరణి పేరుతో పేద రైతుల భూములను కొల్లగొట్టారని, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమితో కేటీఆర్ వీఆర్ఎస్ తీసుకోవాల్సిందే అని రామ్మోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు.






