టీపీసీసీ కార్యవర్గం ప్రకటన.. ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకూ చోటు

by Gantepaka Srikanth |   (  Updated:2025-06-09 16:25:38  IST  )

టీపీసీసీ(Telangana Congress) నూతన కార్యవర్గం ఏర్పాటుపై బిగ్ అప్డేట్ వచ్చేసింది. నూతన కార్యవర్గాన్ని అధిష్టానం సోమవారం ప్రకటించింది.

టీపీసీసీ కార్యవర్గం ప్రకటన.. ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకూ చోటు
X

దిశ, వెబ్‌డెస్క్: ఎట్టకేలకు టీపీసీసీ(Telangana Congress) నూతన కార్యవర్గం ఏర్పాటైంది. నూతన కార్యవర్గాన్ని అధిష్టానం సోమవారం ప్రకటించింది. ఈ మేరకు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్(KC Venugopal) జాబితా విడుదల చేశారు. రాష్ట్ర ఉపాధ్యక్షులుగా 27 మంది, ప్రధాన కార్యదర్శులుగా 69 మందికి అవకాశం కల్పించారు. మొత్తంగా టీపీసీసీ జంబో కార్యవర్గం ఏర్పాటైంది. ఇందులో మెజారిటీ పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీలకే దక్కినట్లు తెలుస్తోంది. టీపీసీసీ చీఫ్‌ మహేశ్ కుమార్‌ గౌడ్‌ పార్టీ అధ్యక్షుడు ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో ఇందుకు సంబంధించిన తుది కసరత్తును పూర్తి చేసి తుది జాబితా ప్రకటించారు. ఇప్పటికే రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ పూర్తయిన విషయం తెలిసిందే. జాబితా కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి.

Next Story