బీఆర్ఎస్ ఎమ్మెల్సీపై ఈసీకీ టీపీసీసీ ఎలక్షన్ సమన్వయ కమిటీ ఫిర్యాదు

by Ramesh Naini |

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ ఈసీకి టీపీసీసీ ఎలక్షన్ సమన్వయ కమిటీ తెలిపింది.

బీఆర్ఎస్ ఎమ్మెల్సీపై ఈసీకీ టీపీసీసీ ఎలక్షన్ సమన్వయ కమిటీ ఫిర్యాదు
X

దిశ, తెలంగాణ బ్యూరో : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు (BRS MLC Shambhipur Raju) ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ ఈసీకి టీపీసీసీ ఎలక్షన్ సమన్వయ కమిటీ తెలిపింది. ఈ నేపథ్యంలోనే బుధవారం కమిటీ ప్రతినిధి లింగం యాదవ్ ఈసీని కలిసి ఫిర్యాదు చేశారు. శంభీపూర్ రాజు ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారని, ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయన తన ఇంటికి ఓటర్లను పిలిపించుకొని డబ్బులు పంచుతున్నారని, శంభీపూర్ రాజు మీద చర్యలు తీసుకోవాలని కంప్లైంట్ చేసినట్లుగా లింగం యాదవ్ తెలిపారు. మెదక్ జిల్లా గడ్డపోతారం మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీకి ఓటేసేందుకు వచ్చిన మహిళను బీఆర్ఎస్ కి ఓటు వేయించారని ఆయన ఆరోపించారు.

Next Story