- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TPCC chief: బడ్జెట్ లో తెలంగాణకు గాడిద గుడ్డు: మహేష్ కుమార్ గౌడ్
తెలుగు కోడలై ఉండి కూడా నిర్మలమ్మ తెలంగాణపై ప్రేమ చూపలేదని టీపీసీసీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (PCC Chief Mahesh Kumar Goud) విమర్శించారు. రాష్ట్రానికి కేంద్రం గాడిద గుడ్డు బడ్జెట్ ఇచ్చిందని దుయ్యబట్టారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఇవాళ కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ (Union Budget 2025-26) పై ఆయన స్పందించారు. తెలుగు మహిళ నిర్మలా సీతారామన్ కేంద్రంలో వరుసగా 8వ సారి బడ్జెట్ ప్రవేశ పెట్టినందుకు ఆమెకు టీపీసీసీ తరపున శుభాకాంక్షలు. అయితే తెలుగు కోడలు అయి ఉండి కూడా నిర్మలమ్మ (Nirmala Sitharaman) తెలంగాణపై ప్రేమ చూపలేదన్నారు. ఈ బడ్జెట్ బిహార్ ఎన్నికల బడ్జెట్ లాగా ఉందని ఎద్దేవా చేశారు. ఎన్నికల కోసమే బీహార్ కు నజరానాలు ఇచ్చారని ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ ను దెబ్బతీయాలనే ప్రయత్నం:
రాజకీయ లబ్ధి కోసమే బీజేపీ కేంద్ర బడ్జెట్ ను ఉపయోగించుకుంటుందని మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు. 50.65 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్రం తెలంగాణ (Telangana)కు ఒక్క పైసా ప్రత్యేక కేటాయింపు జరపలేదని మహేశ్ కుమార్ మండిపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం ఉన్నదనే బీజేపీ వివక్ష చూపుతోందని, రాజకీయంగా తెలంగాణలో కాంగ్రెస్ ను దెబ్బతీయలని చూస్తుందని ధ్వజమెత్తారు. త్వరలో బీహార్ (Bihar) లో అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో అక్కడ రాజకీయ లబ్ధి కోసమే బీజేపీ (BJP) కేంద్ర బడ్జెట్ ను ఉపయోగించుకుంటుంది. దేశం మొత్తం ప్రజల నుంచి వసూలు చేసే బడ్జెట్ లో అందరికీ సమానంగా పంపకాలు ఉండాలన్నారు. నిర్మలమ్మ తన బడ్జెట్ ప్రసంగంలో గురజాడ అప్పారావు 'దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అన్న సూక్తిని వాడారు. మరి తెలంగాణ ప్రజలు దేశంలో మనుషులు కారా? అని ప్రశ్నించారు.
తెలంగాణకు మోడీ ఇచ్చిన హామీలేమయ్యాయి?:
ఎన్నికల సమయంలో ప్రధాని మంత్రి, బీజేపీ నాయకులు తెలంగాణకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని మహేశ్ కుమార్ గౌడ్ నిలదీశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanthreddy), ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ఎంపీలు పలు దఫాలుగా కేంద్ర మంత్రులను, ప్రధాన మంత్రిని కలిసి తెలంగాణకు రావాల్సిన అనేక అంశాలపై విజ్ఞప్తి చేశారు. రైల్వే ప్రాజెక్టులు, విభజన హామీలు, పాలమూరు రంగారెడ్డి నీటిపారుదల ప్రాజెక్టు జాతీయ హోదా, ఐటిఐఆర్, బయ్యారం కోచ్ ఫ్యాక్టరీ, ఐఐఎం లాంటి అనేక పెండింగ్ ప్రాజెక్టులపై వినతిపత్రాలు ఇచ్చారు. రాష్ట్రం నుంచి 40 వేల కోట్ల జీఎస్టీ రూపాయలు కేంద్రానికి వెళ్తున్నాయి. మరి ఆ మేరకు అయిన తెలంగాణకు కేంద్రం నుంచి నిధులు రావాలి కదా అన్నారు. ఇప్పటికైనా కేంద్రం తెలంగాణ కు అవసరమైన అంశాలలో సహకారాన్ని అందించాలన్నారు.






