- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రిజర్వేషన్లు ఇవ్వడం బీఆర్ఎస్, బీజేపీకి ఇష్టం లేదు.. హైకోర్టు ఉత్తర్వులపై టీపీసీసీ చీఫ్ ఫస్ట్ రియాక్షన్
బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడం బీఆర్ఎస్, బీజేపీకి ఇష్టం లేదని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: బీసీలకు రిజర్వేషన్లు (BC reservations) ఇవ్వడం బీఆర్ఎస్, బీజేపీకి ఇష్టం లేదని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు. ఈ మేరకు బీసీ రిజర్వేషన్ల అంశంపై (High Court) హైకోర్టు ఉత్తర్వులపై ఆయన ఫస్ట్ రియాక్షన్ ఏమని ఇచ్చారంటే.. కాంగ్రెస్ పార్టీ కోర్టులను నమ్ముతుందని తెలిపారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ విశ్వ ప్రయత్నం చేసిందని అన్నారు. ఏడాది కాలంగా మేము బీసీల కోసం చేసిన ప్రయత్నాలను ప్రజలు గమనించారని తెలిపారు. దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా శాస్త్రీయ బద్దంగా కుల గణన చేశామని అన్నారు. గతంలో బీసీల రిజర్వేషన్లు తగ్గించింది బీఆర్ఎస్ ప్రభుత్వం అని గుర్తుకు చేశారు. కోర్టు తీర్పును గౌరవిస్తాము.. మాకు చిత్త శుద్ధి ఉందన్నారు.
బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని మేము ఇన్ని రోజులు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకుండా ఆగామని వివరించారు. మేము డిల్లీ లో పోరాటం చేసినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారని బీఆర్ఎస్‌ను ప్రశ్నించారు. బీసీ కేసులో వయసుతో సంబంధం లేకుండా వీహెచ్, కేకే లాంటి నేతలు ఇంప్లిడ్ అయ్యారు మీరు ఎక్కడ ఉన్నారు బీఆర్ఎస్, బీజేపీ నేతలు.. అని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ ఆలోచనను మేము ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పుకొచ్చారు.






