వరంగల్ నేతల వ్యవహారంలో క్రమశిక్షణ కమిటీ చర్యలు.. చిట్ చాట్‌లో టీపీసీసీ చీఫ్ కీలక విషయాలు

by Ramesh Naini |

జూబ్లిహిల్స్‌లో ఎన్నిక ఎప్పుడు జరిగినా మేము గెలుస్తామని టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు.

వరంగల్ నేతల వ్యవహారంలో క్రమశిక్షణ కమిటీ చర్యలు.. చిట్ చాట్‌లో టీపీసీసీ చీఫ్ కీలక విషయాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: జూబ్లీహిల్స్‌లో ఎన్నిక ఎప్పుడు జరిగినా మేము గెలుస్తామని టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్డ (TPCC Chief Mahesh Kumar Goud) ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం గాంధీభవన్‌లో మీడియాతో చిట్ చాట్‌లో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ కోసం పని చేసిన ప్రతి వారిని గుర్తిస్తామని ఆయన అన్నారు. గాంధీ భవన్‌లో జూలై 4 న పీఏసీ సమావేశం ఉంటుందని, అనంతరం పీసీసీ విస్తృత స్థాయి మీటింగ్ ఉంటుందని చెప్పారు. అదే రోజు సాయంత్రం ఎల్బీ స్టేడియంలో గ్రామస్థాయి నేతలతో బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఎల్బీ స్టేడియం సభ కి 15,000 మంది హాజరవుతారని, జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కమిటీ మీటింగ్‌లో భాగంగా ఈ సభ ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టం చేశారు. వరంగల్ నేతలు వ్యవహారంలో క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకుంటుందని తెలిపారు.

దివంగత కాంగ్రెస్ నేత డి శ్రీనివాస్ జీవితాంతం సెక్యూలరిస్టుగా ఉన్నారని, అలాంటి నేత విగ్రహాన్ని బీజేపీ నాయకుడితో ఓపెన్ చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను డీఎస్ ఒప్పుకోరని తెలిపారు. బీజేపీ నాయకుడితో విగ్రహం ప్రారంభిస్తే ఆయన ఆత్మ క్షోభిస్తోందని అన్నారు. డీఎస్ విగ్రహానికి ప్లేస్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం.. కానీ కాంగ్రెస్ నాయకులకు ఎవరికి ఆహ్వానం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన బీజేపీ లో ఏనాడూ లేడు.. కొన్ని కారణాల వల్ల ఆయన బీఆర్ఎస్‌లో జాయిన్ అయ్యారని తెలిపారు. కాంగ్రెస్ దివంగత నేత ముఖేష్ గౌడ్ (Mukesh Goud) విగ్రహం హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు.

Next Story