- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హరీశ్ - ఈటల భేటీపై పక్కా సమాచారం మా వద్ద ఉంది: టీపీసీసీ చీఫ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు
బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హారీశ్‌రావుకు టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ సవాల్ విసిరారు.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హారీశ్‌రావుకు టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ (TPCC Chief Mahesh Kumar Goud) సవాల్ విసిరారు. ఇవాళ (సోమవారం) ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనపై బహిరంగ చర్చకు రావాలా? హరీశ్‌రావుతో ఎక్కడైనా చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. బీఆర్ఎస్ (BRS) పదేళ్ల పాలనలో ప్రభుత్వ భూములను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించిన మాట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. కంచె చేను మేసినట్లు ప్రభుత్వ ఆస్తులు నాశనం చేశారని ఆరోపించారు.
అలాగే (Harish Rao) హరీశ్‌రావు, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ (Etela Rajender) భేటీ అయ్యారని ఆయన మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. వీరి భేటీపై పక్కా సమాచారం తమ వద్ద ఉందని కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ దేశానికి రోల్ మోడల్ అని, రూ. 1.20 లక్షల కోట్లు ఖర్చు పెట్టిన కాళేశ్వరం వల్ల ఒక్క ఎకరానికి నీరు వచ్చిందా? అని ప్రశ్నించారు. (Kaleshwaram) కాళేశ్వరం కాస్త కూళేశ్వరం అయిందని ఎద్దేవా చేశారు. అసలు హరీశ్‌రావుకు బీఫాం వస్తుందా? “నాలుగు ముక్కలాట”లో ఏ పార్టీ నుంచి పోటీ చేస్తావ్ హరీశ్ రావు.. అంటూ సెటైర్లు వేశారు. బీఆర్ఎస్, బీజేపీ పార్టీల పొత్తుపై కవిత వ్యాఖ్యలకు ముందు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.






