- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
90 శాతం మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు కాంగ్రెస్ ఖాతాలో : టీపీసీసీ చీఫ్ కీలక జోస్యం
తెలంగాణలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించబోతోందని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించబోతోందని టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్‌లలో జరిగిన పోలింగ్ సరళిని పరిశీలిస్తే సుమారు 90 శాతం స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం సాధించబోతోందని ఆయన కీలక జోస్యం చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో అమలవుతున్న ప్రజా పాలన ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు పట్టణ ఓటర్లు పట్టం కట్టారని మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. ప్రజల అవసరాలను గుర్తించి తీసుకుంటున్న వేగవంతమైన నిర్ణయాలు, పారదర్శక పరిపాలన, సామాజిక న్యాయానికి కట్టుబడి ఉండటంతో కాంగ్రెస్ పట్ల ప్రజల్లో విశ్వాసాన్ని మరింత పెంచాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారనే విషయాన్ని ఈ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయని అన్నారు.
పట్టణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధి, రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి సదుపాయాలు, పారిశుధ్య వ్యవస్థ మెరుగుదలపై ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఓటర్లలో సానుకూల భావనను కలిగించాయని మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. ఈ ఎన్నికల ద్వారా కాంగ్రెస్ పై ప్రజలు ఉంచిన విశ్వాసం భవిష్యత్‌లో మరింత బాధ్యతగా పని చేయాలని సూచిస్తోంది, ప్రజలు ఇచ్చిన ఈ మద్దతు మా బాధ్యతను మరింత పెంచిందని పేర్కొన్నారు. ప్రతి మున్సిపాలిటీ, ప్రతి కార్పొరేషన్‌లో పారదర్శకతతో, ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తామని, ప్రతిపక్ష పార్టీలు ప్రచారం చేసిన అసత్యాలు, అవాస్తవాలను ప్రజలు నమ్మలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇచ్చి నిలబడే ప్రభుత్వమని, ప్రజల సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.






