- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీసీ రిజర్వేషన్‌లు ఆపడంలో అసలైన ముద్దాయి బీజేపీ.. టీపీసీసీ చీఫ్ తీవ్ర ఆరోపణలు
బీసీ రిజర్వేషన్‌లు ఆపడంలో అసలైన ముద్దాయి బీజేపీ అని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: (BC reservations) బీసీ రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నామని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (TPCC chief Mahesh Kumar Goud) తెలిపారు. ఈ మేరకు ఆయన శనివారం నిజామాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అంశంపై హైకోర్టు స్టే ఇవ్వడంపై సుప్రీంకోర్టుకు వెళ్లి అప్పీలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. అక్కడ వెసులు బాటు దొరుకుతుందని ఆశిస్తున్నామని చెప్పారు. బీసీ రిజర్వేషన్‌లు ఆపడంలో అసలైన ముద్దాయి (BJP) బీజేపీ అని కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ (BRS) కలిసి బీసీ రిజర్వేషన్‌ను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.
గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్ ఉంచారు.. గవర్నర్‌ను నియమించేది ఎవరు..? అని ప్రశ్నించారు. మూడు చట్టాలు ఒక ఆర్డినెన్సు తెలంగాణ గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్నాయన్నారు. బీసీలకు నోటి దాకా వచ్చిన ఫలాలను అడ్డుకున్నారని మండిపడ్డారు. బీసీ రిజర్వేషన్ పై కాంగ్రెస్ కు చిత్తశుద్ధి ఉందన్నారు. మోడీ బీసీ ప్రధాని అని చెప్పుకునే బీజేపీ నేతలు బీసీ రిజర్వేషన్ బిల్లుపై ఎందుకు ఒత్తిడి తీసుకురావడం లేదని ప్రశ్నించారు. అలాగే బనకచర్ల ప్రాజెక్టు విషయంలో చేయాల్సింది అంతా చేశారని, బీఆర్ఎస్ ఉదాసీనత వల్ల బనకచర్ల జీవోలు ఇచ్చారని అన్నారు. రాయలసీమను రతనాల సీమ చేస్తా అన్నది కేసీఆర్ కాదా..? అని ప్రశ్నించారు. తెలంగాణకు దక్కాల్సిన ఒక్క నీటి చుక్కను కొదులుకోమని అన్నారు. ఇక, మంత్రుల మధ్య విభేదాలు అన్ని సర్దుబాటు చేసుకుంటామని క్లారిటీ ఇచ్చారు.






