బెంగాల్‌లో బీజేపీ ఓటు చోరీతో గెలిచింది: టీపీసీసీ చీఫ్, మహేష్ కుమార్ గౌడ్

by Ajay Maddhiboyina |

ఈనెల 10వ తేదీన ప్రధాని మోడీ హైదరాబాద్ కి వస్తున్నారని, మోడీ హైదరాబాద్ వచ్చే లోపు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో సీబీఐ విచారణ చేపడుతారా లేదా చెప్పాలని టీపీసీసీ చీఫ్​మహేష్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు.

బెంగాల్‌లో బీజేపీ ఓటు చోరీతో గెలిచింది: టీపీసీసీ చీఫ్, మహేష్ కుమార్ గౌడ్
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఈనెల 10వ తేదీన ప్రధాని మోడీ హైదరాబాద్ కి వస్తున్నారని, మోడీ హైదరాబాద్ వచ్చే లోపు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో సీబీఐ విచారణ చేపడుతారా లేదా చెప్పాలని టీపీసీసీ చీఫ్​మహేష్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన గాంధీభవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో వేల కోట్ల అవినీతి జరిగిందని చెప్పామని, దర్యాప్తు జరపాలని సీబీఐ విచారణ కోరుతూ సీబీఐ లేఖ రాశామన్నారు. బండి సంజయ్ కేంద్ర మంత్రి అనే విషయం మర్చిపోయి మాట్లాడుతున్నారని, సీబీఐ విచారణ ఎందుకు చేయడం లేదో బండి సంజయ్ సమాధానం చెప్పాలని మహేష్ కుమార్ గౌడ్ నిలదీశారు. ఎన్నికల ముందు కాళేశ్వరంలో అవినీతి జరిగిందని బీజేపీ నేతలు చెప్పారని, కాళేశ్వరం విషయంలో కేసీఆర్ ను ఎందుకు అరెస్ట్ చేయడం లేదో బండి సంజయ్ చెప్పాలని ఆయన డిమాడ్ చేశారు.

కేంద్రంలో బీజేపీ అధికారం లోకి వచ్చాక సీడీఐ విచారణ చేయడం లేదని, బీఆర్ఎస్ నేతల మద్దతు లేకుండా బీజేపీకి రాష్ట్రంలో 8 సీట్లు వచ్చేవా? హరీష్ రావు మద్దతు లేకుండా బీజేపీ ఎంపీ మెదక్ లో గెలిచారా? అని మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. తుపాకీ మా భుజాల మీద పెట్టి కాల్చాలని బండి సంజయ్ చూస్తున్నారని ఆయన ఆరోపించారు. వరి వేస్తే ఉరి అన్నది బీఆర్ఎస్ ప్రభుత్వమే కదా, ఇవ్వాలా మీరు రైతుల కోసం ఏదో చేస్తున్నట్లుగా ముసలి కన్నీరు కారుస్తున్నారని మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. రైతులకు రుణమాఫీ, రైతు బంధు, బోనస్ ఇస్తుంది తమ ప్రభుత్వమని, మా ప్రభుత్వం మక్కలు కూడా కొంటుందన్నారు. బెంగాల్ లో బీజేపీకి అనుకూల పరిస్థితులు లేవని, బెంగాల్ లో బీజేపీ ఓటు చోరీతో గెలిచింది..90లక్షల ఓట్లు తొలగించిందని మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఓటును కాపాడుకోవాలని ఆయన సూచించారు. మమత బెనర్జీ, కేజ్రీవాల్ మీద కేసులు పెట్టిన కేంద్ర ప్రభుత్వం కేసీఆర్ మీద ఎందుకు పెట్టడం లేదని, బీజేపీ వాళ్ళు తలుచుకుంటే రేపు సీబీఐ విచారణ చేయవచ్చని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.

Next Story