- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో ప్రత్యామ్నాయమే లేదు: టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో ప్రత్యామ్నాయమే లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ క్షేత్ర స్థాయిలో బలంగా ఉందని స్థానిక సంస్థల ఎన్నికలు నిరూపించాయని వ్యాఖ్యానించారు.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో ప్రత్యామ్నాయమే లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ క్షేత్ర స్థాయిలో బలంగా ఉందని స్థానిక సంస్థల ఎన్నికలు నిరూపించాయని వ్యాఖ్యానించారు. మీడియా చిట్ చాట్ లో ఆయన మాట్లాడుతూ.. 67శాతం బీసీ వార్డు మెంబర్లు గెలిచారని, 87.5శాతం ఎస్సీ, ఎస్సీ, బీసీలకు కాంగ్రెస్ టికెట్లు ఇచ్చిందన్నారు. 94 మున్సిపాలిటీలను గెలిచామంటే అభివృద్ధి, సంక్షేమం పట్ల ప్రజలు సానుకూలతకు నిదర్శనం అని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తాచాటిన సంగతి తెలిసిందే. కొన్ని చోట్ల బీఆర్ఎస్, బీజేపీ గట్టి పోటీ ఇచ్చినా అధికార పార్టీ ఎలాంటి పొత్తులు లేకుండా మెజార్టీ స్థానాలను తన ఖాతాలో వేసుకుంది. ఇక మున్సిపల్ ఛైర్మన్ ల ఎన్నికలలోనూ మంత్రులు, ఎమ్మెల్యేలు కీలక పాత్ర పోశించి మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ జెండాను ఎగరవేశారు.






