42% రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కమిట్‌మెంట్ ఉంది: టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

by Ajay Maddhiboyina |

42శాతం రిజ‌ర్వేష‌న్ల‌పై కాంగ్రెస్ పార్టీకి క‌మిట్‌మెంట్ ఉందని తెలంగాణ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలతో భేటీ అనంతరం మహేశ్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ.. 42శాతం రిజ‌ర్వేష‌న్ల విషయంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న కమిట్‌మెంట్ ఏ పార్టీకి లేదన్నారు.

42% రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కమిట్‌మెంట్ ఉంది: టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
X

దిశ‌, వెబ్ డెస్క్: 42శాతం రిజ‌ర్వేష‌న్ల‌పై కాంగ్రెస్ పార్టీకి క‌మిట్‌మెంట్ ఉందని తెలంగాణ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలతో భేటీ అనంతరం మహేశ్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ.. 42శాతం రిజ‌ర్వేష‌న్ల విషయంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న కమిట్‌మెంట్ ఏ పార్టీకి లేదన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ల కోసం ఎన్నో ప్రయత్నాలు చేసిందని చెప్పారు. బీజేపీ ఎన్నో అడ్డంకులు తీసుకువచ్చిందని ఆరోపించారు. జూబ్లిహిల్స్ ఎన్నికల్లో ప్రజలు మంచి మెజారిటీతో గెలిపించారని చెప్పారు. నవీన్ యాదవ్‌ను రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ అభినందించారని అన్నారు. యావత్ ప్రజానీకం కాంగ్రెస్ పార్టీతోనే ఉందని జూబ్లీహిల్స్ ప్రజలు సందేశం ఇచ్చారని చెప్పారు. ఇదే ఉత్సాహంతో రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.

Next Story