- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఢిల్లీకి టీ కాంగ్రెస్.. ఓట్ చోరీ ధర్నాను సక్సెస్ చేయండి: టీపీసీసీ పిలుపు
ఓట్ చోరీ జరిగిందని దేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏఐసీసీ మహా ధర్నాకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.

X
దిశ, డైనమిక్ బ్యూరో: ఓట్ చోరీ జరిగిందని దేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏఐసీసీ మహా ధర్నాకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తెలంగాణ కాంగ్రెస్ నేతలు సంసిద్ధమయ్యారు. ఈ మేరకు ఇవాళ (శనివారం) టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఓట్ చోరీకి వ్యతిరేకంగా రేపు 14వ తేదీ ఆదివారం నాడు ఢిల్లీ రామ్ లీలా మైదానంలో మహా ధర్నా కార్యక్రమం ఉందని తెలిపారు. సాయంత్రం 4 గంటలకు ధర్నా ఉంటుందని తెలంగాణ నుంచి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల భారీగా తరలి వచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఏఐసీసీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ఓట్ చోరీ పై సంతకాల సేకరణ నిర్వహించినట్లు తెలిపారు. 2 రోజుల క్రితం హైదరాబాద్ నుంచి సంతకాల సేకరణ చేపట్టిన ఫామ్‌లను ప్రత్యేక వాహనంలో ఢిల్లీకి పంపినట్లు తెలిపారు.
Next Story






