రేపటి కేబినెట్ సమావేశం వాయిదా.. సచివాలయం నుంచి అధికారిక ప్రకటన

by Kema Shiva Kumar |   (  Updated:2025-11-06 08:22:24  IST  )

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) అధ్యక్షతన రేపు జరగబోయే కేబినెట్ సమావేశం (Cabinet Meeting) వాయిదా పడింది.

రేపటి కేబినెట్ సమావేశం వాయిదా.. సచివాలయం నుంచి అధికారిక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) అధ్యక్షతన రేపు జరగబోయే కేబినెట్ సమావేశం (Cabinet Meeting) వాయిదా పడింది. తిరిగి ఈ నెల 12న మధ్యాహ్నం 3 గంటలకు కేబినెట్ భేటీని నిర్వహించనున్నట్లు సచివాలయం నుంచి ఇవాళ అధికారిక ప్రకటన వెలువడింది. స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా మంత్రివర్గ సమావేశంలో చర్చించి ఎన్నికలపై తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా, స్థానిక ఎన్నికల్లో పోటీకి అడ్డుగా ఉన్న ముగ్గురు పిల్లల నిబంధనను ఎత్తివేస్తూ తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం-2018లోని సెక్షన్‌ 21(3)ని తొలగిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఆ ఫైలుపై గవర్నర్ జిష్ణుదేవ్ వర్మా ఆమోదం తెలపడంతో న్యాయ శాఖ గెజిట్ విడుదల చేసింది.

Next Story