నేడు భద్రాద్రిలో వైభవంగా సీతారాములవారి కల్యాణం

by Disha Web Desk 4 |
నేడు భద్రాద్రిలో వైభవంగా సీతారాములవారి కల్యాణం
X

దిశ, వెబ్‌డెస్క్: నేడు భద్రాద్రిలో సీతారాముల వారి కల్యాణం అంగరంగ వైభవంగా జరగనుంది. భద్రాద్రి ఆలయంలో వైభవోపేతంగా తిరు కల్యాణ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. తిరు కల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు ప్రధాన ఘట్టం ఆవిష్కృతం కానుంది. కల్యాణ మహోత్సవానికి సర్వాంగ సుందరంగా భద్రాద్రి ముస్తాబు అయింది. భద్రాచలం పురవీధులు శ్రీ రామ నామస్మరణతో మార్మోగుతున్నాయి. మిథిలా మైదానంలో వైభవోపేతంగా సీతారాముల కల్యాణం సాగనుంది. మిథిలా మండపంలో సీతారాముల కోసం కల్యాణ మండపం ముస్తాబైంది. కల్యాణం తిలకించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి భద్రాద్రికి భారీగా భక్తులు చేరుకుంటున్నారు. ప్రభుత్వం తరఫున స్వామివారికి సీఎస్ పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.

ప్రభుత్వం తరఫున స్వామివారికి సీఎస్ పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ముత్యాల తలంబ్రాలను సీఎస్ శాంతి కుమారి సమర్పించనున్నారు. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు స్వామి వారి కల్యాణ క్రతువు జరగనుంది. అభిజిత్ లగ్నంలో సీతారాముల కల్యాణం జరగనుంది. స్వామి వారి కల్యాణానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తుల కోసం ఆలయ పరిసరాల్లో చలువ పందిళ్లు, కూలర్లు ఏర్పాటు చేశారు. భక్తుల కోసం ముత్యాల తలంబ్రాలు, లడ్డూ ప్రసాదాల పంపిణీకి కౌంటర్లు ఏర్పాటు చేశారు. భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. 2వేల మంది పోలీసులు, సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా క్యూఆర్ కోడ్‌తో భక్తులకు దిశానిర్దేశం చేయనున్నారు.


Next Story

Most Viewed