- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణకు వర్ష సూచన.. అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్
by Ajay Maddhiboyina |
నేడు తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

X
దిశ, వెబ్ డెస్క్: నేడు తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ వర్షం రోజంతా కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. పలు జిల్లాల్లో మధ్యాహ్నం ప్రాంతంలో వర్షం ప్రారంభమై సాయంత్రం నాటికి ప్రభావం పెరుగుతుందని అంచనా వేసింది. ముఖ్యంగా కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ జిల్లా, హనుమకొండ, వరంగల్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ఖమ్మం జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, హైదరాబాద్ లో ఉదయం పూట కొన్ని ప్రాంతాల్లో చిరు జల్లులు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.
Next Story






