నేడు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి.. సీఎం రేవంత్ షెడ్యూల్ ఇదే

by Kema Shiva Kumar |

కాంగ్రెస్ నేత, దేశ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ (Rajiv Gandhi) జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఉదయం 10 గంటలకు సచివాలయం ఎదురుగా ఉన్న రాజీవ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించనున్నారు.

నేడు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి.. సీఎం రేవంత్ షెడ్యూల్ ఇదే
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ నేత, దేశ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ (Rajiv Gandhi) జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఉదయం 10 గంటలకు సచివాలయం ఎదురుగా ఉన్న రాజీవ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించనున్నారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా 11 గంటలకు శేరిలింగంపల్లి మండల పరిధిలోని గచ్చిబౌలిలో డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రేషన్ బిల్డింగ్ కార్యాలయానికి శంకుస్థాపన చేస్తారు. ఆ తరువాత మధ్యాహ్నం 12 గంటలకు గండిపేట మండల పరిధిలోని నియో పోలీస్ కోకాపేట్ వద్ద ఎగ్జిట్ రహదానిని ప్రారంభిస్తారు. సాయంత్రం జన్వాడ వద్ద ‘కే’ కన్వెన్షన్‌లో తన సోదరుడు తిరుపతి రెడ్డి (Tirupati Reddy) కూతురు వివాహా నిశ్చితార్థ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు కూడా హాజరుకానున్నారు.

Next Story