తెలంగాణకు రెయిన్ అలర్ట్.. నేడు ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు

by Ajay Maddhiboyina |

తెలంగాణలో గత కొద్దిరోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రతిరోజు ఏదో ఒకచోట వర్షం కురుస్తూనే ఉంది. కాగా నేడు కూడా రాష్ట్రంలో పలు జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని వెదర్ మ్యాన్ పేర్కొన్నారు.

తెలంగాణకు రెయిన్ అలర్ట్.. నేడు ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో గత కొద్దిరోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రతిరోజు ఏదో ఒకచోట వర్షం కురుస్తూనే ఉంది. కాగా నేడు కూడా రాష్ట్రంలో పలు జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని వెదర్ మ్యాన్ పేర్కొన్నారు. వనపర్తి, నాగర్ కర్నూల్, నల్గొండ జిల్లాల్లో రాత్రంతా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. నిర్మల్, నిజామాబాద్, సిరిసిల్ల, సిద్దిపేట్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. హైదరాబాద్ లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. ఇక ఇప్పటికే నగరంలో వర్షం మొదలైంది. నార్సింగి, గచ్చిబౌలి, నానక్ రామ్ గూడ, మణికొండ, ఖాజాగుడ, షేక్ పేట్, టోలిచౌకి, అత్తాపూర్, పటాన్ చెరు, షేర్ లింగంపల్లి ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది.

Next Story