నేడు,రేపు జిల్లాల్లో ఇన్ ఛార్జి మంత్రుల పర్యటన..!

by Ajay Maddhiboyina |

నేడు,రేపు జిల్లాల్లో ఇన్ ఛార్జి మంత్రులు పర్య‌టించ‌నున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో రెండు రోజుల పాటు మంత్రులు జిల్లాల పర్యటనకు రానున్నారు. ఉ

నేడు,రేపు జిల్లాల్లో ఇన్ ఛార్జి మంత్రుల పర్యటన..!
X

దిశ‌, వెబ్ డెస్క్: నేడు,రేపు జిల్లాల్లో ఇన్ ఛార్జి మంత్రులు పర్య‌టించ‌నున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో రెండు రోజుల పాటు మంత్రులు జిల్లాల పర్యటనకు రానున్నారు. ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీత‌క్క‌, కొండా సురేఖ ప‌ర్య‌టిస్తారు. ఖ‌మ్మం జిల్లాలో మంత్రులు తుమ్మ‌ల నాగేశ్వ‌ర్ రావు, కోమ‌టిరెట్టి వెంక‌ట్ రెడ్డి ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ధాన్యం సేకరణ, భూభారతి రెవెన్యూ సదస్సులు, వానాకాలం పంటల సాగు, వర్షాలపై కలెక్టర్లతో సమీక్షలు నిర్వ‌హించ‌నున్నారు.

అంతే కాకుండా జిల్లాల వారీగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు, పెండింగ్ ప్రాజెక్టులపై తీసుకోవాల్సిన చర్యలపై మంత్రులు, కలెక్టర్లు నివేదిక‌ను సిద్ధం చేయ‌నున్నారు. అన్ని అంశాలపై సమగ్ర వివరాలతో నివేదిక సిద్ధం చేయాలని సీఎం రేవంత్ మంత్రుల‌ను ఆదేశించిన‌ట్టు తెలుస్తోంది. ఇక రెండు రోజుల ప‌ర్య‌ట‌న త‌ర‌వాత జూన్ 1న సచివాలయంలో మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం అవుతారు. స‌మావేశంలో సీఎంకు నివేదిక స‌మ‌ర్పించి జిల్లాల్లోని ప‌రిస్థితుల‌ను వివ‌రించ‌నున్నారు.

Next Story