- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపిలో కలిపిన నాలుగు పంచాయతీలను తెలంగాణలో విలీనం చేయాలి
ఏపిలోని కలిపిన నాలుగు గ్రామ పంచాయతీలను తెలంగాణలో విలీనం చేయాలని కేంద్ర మంత్రి అమిత్‌షా ను రాష్ట్ర వ్యవసాయ

- ఏపిలో కలిపిన నాలుగు పంచాయతీలను తెలంగాణలో విలీనం చేయాలి
- యాటపాక, కన్నాయిగూడం, పిచుకలపాడు, పురుషోత్తపట్నం ప్రజలకు ఇబ్బందులు
- 2014 చట్ట ప్రకారం తగిన చట్టపరమైన, పరిపాలనా చర్యలు తీసుకోవాలి
- కేంద్ర మంత్రి అమిత్‌షాను లేఖ ద్వారా కోరిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల
దిశ, తెలంగాణ బ్యూరో : ఏపిలోని కలిపిన నాలుగు గ్రామ పంచాయతీలను తెలంగాణలో విలీనం చేయాలని కేంద్ర మంత్రి అమిత్‌షా ను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కోరారు. ఆదివారం నిజామాబాద్‌లో పసుపు బోర్డు ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఆయనను కలిసి విలీనం గ్రామాల సమస్యలను వివరించి లేఖ అందజేశారు. ఈసందర్భంగా పేర్కొంటూ ఏపి పునర్విభజన చట్టం 2014 లో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో కలిసిన భద్రాచలం చుట్టుపక్క గ్రామాలైన యాటపాక, కన్నాయిగూడం, పిచుకలపాడు, పురుషోత్తపట్నం లను తిరిగి తెలంగాణలో విలీనం చేయాలని వినవించారు. భద్రాచలం పట్టణం తెలంగాణలో కొనసాగుతుండగా, నాలుగు గ్రామ పంచాయతీలు విభజనలో భాగంగా ఏపీలో కలిపారని, వీటితో అనేక పరిపాలనా, అభివృద్ధి ఇబ్బందులు సమస్యలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
భద్రాచలం పట్టణం తెలంగాణ ప్రధాన మండలాల మధ్య రవాణా అంతరాయం ఏర్పడుతుందని, భద్రాచలంలోని విద్యాసంస్థల్లో చదివే గిరిజన విద్యార్థులకు రాకపోకల్లో , రెండు రాష్ట్రాల చెక్‌పోస్టులతో గిరిజనులు, వాణిజ్య వాహనాలకు ఇబ్బందులు కలుగుతున్నాని పేర్కొన్నారు. ఎల్‌డబ్ల్యూఈ ప్రభావిత ప్రాంతం కావడంతో శాంతి భద్రతల సమస్యలు కూడా ఏర్పడుతున్నాయని, భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం నిర్వహణకు కూడా ఇబ్బందులు కలుగుతున్నాయని, దేవస్థానం భూములు ఏపీ పరిధిలో ఉన్నాయని అన్నారు. ఈ సమస్యలను పరిష్కరించేందుకు, ఆ గ్రామ పంచాయతీలను తిరిగి తెలంగాణలో కలపడం అత్యవసరమని మంత్రి లేఖలో ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 ప్రకారం తగిన చట్టపరమైన, పరిపాలనా చర్యలు తీసుకోవాలని కోరారు.






