ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. మూడు ఎఫ్ఐఆర్‌లు నమోదు

by Kema Shiva Kumar |   (  Updated:2025-11-11 06:18:19  IST  )

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ వేళ నాల్ లోకల్ నేతలపై ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. మూడు ఎఫ్ఐఆర్‌లు నమోదు
X

దిశ, వెబ్‌డెస్క్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ వేళ నాల్ లోకల్ నేతలపై ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తూ పోలింగ్ బూత్‌ల వెంట తిరుగుతున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై కఠిన చర్యలకు తీసుకోవాలని ఈసీ, అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ మాట్లాడుతూ.. ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు పాల్పడిన స్థానికేతర ప్రజాప్రతినిధులపై ఇప్పటి వరకు మూడు ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశామని అన్నారు. కోడ్ ఉల్లంఘించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కూడా గుర్తించామని స్పష్టం చేశారు. పోలింగ్ సమయం దగ్గర పడుతోన్న క్రమంలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆర్వీ కర్ణన్ మరోసారి విజ్ఞప్తి చేశారు.

Read More... ఎన్నికల ముందే దాడులు చేస్తున్నారు.. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్‌రెడ్డి

Next Story