- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏసీబీ దాడులలో మూడు కేసులు నమోదు, నలుగురు అరెస్ట్
ఏసీబీ దాడులలో మూడు కేసులు నమోదు, నలుగురు అరెస్ట్ ... వికారాబాద్ కలెక్టరెట్ లో జూనియర్ అసిస్టెంట్ అరెస్ట్

ఏసీబీ దాడులలో మూడు కేసులు నమోదు, నలుగురు అరెస్ట్ ...
వికారాబాద్ కలెక్టరెట్ లో జూనియర్ అసిస్టెంట్ అరెస్ట్
దిశ, తెలంగాణ బ్యూరో: ఏసీబీ అధికారులు చెపట్టిన దాడులలో ఒకే రోజు మూడు చోట్లు అవీనితి అధికారులు పట్టుబడ్డారు. ఏసీబీ అధికారులు జరుపుతున్న దాడులలో ఇటీవల కాలంలో ఒకే రోజులు మూడు, నాలుగు కేసులు నమోదవుతున్నాయి. మంగళవారం ఏసీబీ అధికారులు చెపట్టిన దాడులలో మండల సర్వేయర్ ఇద్దరూ జూనియర్ అసిస్టెంట్స్ పట్టుబడ్డారు.
* పెద్దపల్లి జిల్లా మండల సర్వేయర్ పైనండ్ల సునీల్ ను క్రిమినల్ మిస్ కండక్ట్ క్రింద ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అతనితో పాటు కటుకూరి రాజేందర్ రెడ్డి అనే మరో వ్యక్తి కూడా అదుపులోకి తీసుకున్నారు. సర్వే పంచనామా విషయంలో రూ.10వేలు డిమాండ్ చేసినట్లు ఫిర్యాదు రావడంతో నిఘా పెట్టి పట్టుకున్నారు..
*మంచిర్యాల జిల్లా అనగారాజ్ పల్లి , కోటపల్లి పిహెసీ లో పని చేస్తున్న జూనియర్ అసిస్టెంట్ గడియారం శ్రీనివాసులు ఏసీబీకి పట్టుబడ్డారు. డిఏ ఏరియర్స్ బిల్లు సబ్మింట్ చేసేందుకు రూ.6వేలు లంచం తీసుకుంటు పట్టుబడ్డారు. శ్రీనివాసులను అరెస్ట్ చేసి కరీంనగర్ ఏసిబి స్పెషల్ జడ్జి ఏదుట హజరుపరిచారు..
* వికారాబాద్ జిల్లా కలెక్టరెట్ లో జూనియర్ అసిస్టెంట్ గా చేస్తున్న కె సుజాత ఏసీబీ అధికారుకుల పట్టుబడ్డారు. భూ సంబంధిత డ్యాక్యుమెంట్ ను నవాబ్ పేట తహసిల్థారు కార్యాలయానికి పంపేందుకు రూ.15వేలు లంచం డిమాండ్ చేసి పట్టుబడ్డారు. సుజాతను అరెస్ట్ చేసి జ్యూడిషియల్ రిమాండ్ కు పంపినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. కేసు తదుపరి దర్యాప్తు జరుగుతుందని పేర్కోన్నారు.






