- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యుత్ ఆఫీస్‌లో మందు పార్టీ.. ముగ్గురూ సస్పెండ్
జగిత్యాల(Jagtial) ఎన్పీడీసీఎల్(NPDCL) కార్యాలయంలో ఆశ్చర్యకర ఘటన వెలుగుచూసిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: జగిత్యాల(Jagtial) ఎన్పీడీసీఎల్(NPDCL) కార్యాలయంలో ఆశ్చర్యకర ఘటన వెలుగుచూసిన విషయం తెలిసిందే. కార్యాలయంలో పనిచేసే కొందరు సిబ్బంది ఆఫీస్‌ను బార్‌గా మార్చి పార్టీ చేసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. డ్యూటీ ముగిసిన వెంటనే ఫైళ్లను క్లోజ్ చేసి.. బాటిల్స్ ఓపెన్ చేసి ఆఫీస్ గదుల్లోనే మందు సేవించడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా ఈ ఘటనపై అధికారులు చర్యలు తీసుకున్నారు. స్టాఫ్ రూమ్‌లో మద్యం సేవించిన ముగ్గురు అసిస్టెంట్ లైన్ మెన్లు ఏ.ప్రభాకర్, జి.బాలకృష్ణ, వి.రాజశేఖర్‌లను సస్పెండ్ చేయడం జరిగిందని జగిత్యాల డివిజినల్ ఇంజినీర్ గంగారాం తెలిపారు. విధులు నిర్వహించే ప్రదేశాల్లో అనైతిక కార్యకలాపాలు, క్రమశిక్షణా విరుద్ధ చర్యలకు పాల్పడితే ఎటువంటి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని ఉద్యోగస్తులకు, సిబ్బందికి సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి హెచ్చరికలు జారీ చేశారు. విధుల్లో ప్రవర్తన బాగోలేకపోయినా.. నియమాలు ఉల్లంఘించి అనైతిక చర్యలకు పాల్పడినా తక్షణమే విధుల నుండి తక్షణమే తొలగిస్తామని గట్టిగా హెచ్చరించారు. ఇందుకు సంబంధించి హెచ్ఆర్డీ విభాగం ఆదివారం అడ్వైజరీ మెమోను జారీచేసింది.






