అడ్రస్ లేని వారికి పదవులిచ్చారు.. ఎంపీ రేణుకా చౌదరి హాట్ కామెంట్స్

by Kema Shiva Kumar |

పార్టీలో అంతర్గతంగా ఉన్న సమస్యలను పరిష్కరించుకుని స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ త్వరలోనే ప్రజాక్షేత్రంలోకి వెళ్తామని సీనియర్ కాంగ్రెస్ నేత, రాజ్యసభ ఎంపీ రేణుకా చౌదరి (Renuka Chowdary) అన్నారు.

అడ్రస్ లేని వారికి పదవులిచ్చారు.. ఎంపీ రేణుకా చౌదరి హాట్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: పార్టీలో అంతర్గతంగా ఉన్న సమస్యలను పరిష్కరించుకుని స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ త్వరలోనే ప్రజాక్షేత్రంలోకి వెళ్తామని సీనియర్ కాంగ్రెస్ నేత, రాజ్యసభ ఎంపీ రేణుకా చౌదరి (Renuka Chowdary) అన్నారు. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. పదవుల విషయంలో పార్టీలో చాలా అసంతృప్తి ఉందని అన్నారు. రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి రావడానికి కష్టపడిన కార్యకర్తలెవరికీ గుర్తింపు లభించడం లేదని ఆరోపించారు. చుట్టపుచూపుగా వచ్చిన వారికి.. అడ్రస్ లేని వాళ్లకు పదవులు కట్టబెట్టారని ఫైర్ అయ్యారు. అసలుసిసలైన కార్యకర్తలకు అన్యాయం జరిగితే మాత్రం తాను ఊరకునేది లేదని రాష్ట్ర అధినాయత్వానికి ఆమె వార్నింగ్ ఇచ్చారు. ఖమ్మం (Khammam) ఇలాఖాలో ముగ్గురు మంత్రులు ఉన్నారని.. పార్టీని బలోపేతం చేయకుండా ఏం చేస్తున్నారని మండిపడ్డారు. తాను ఖమ్మం జిల్లా ఆడబిడ్డనని.. నన్న ఆపేది ఎవరని ఫైర్ అయ్యారు. పార్టీ పదవుల విషయంలో తనకే అసంతృప్తిగా ఉందని.. ఇక సాధారణ కార్యకర్తలకు ఉండదా అని కామెంట్ చేశారు. స్థానిక ఎన్నికల్లోపు పార్టీలో అసంతృప్తి అన్న మాట వినపడకుండా చేయాలని ఆమె రాష్ట్ర అధినాయకత్వంతో పాటు పార్టీ హైకమాండ్‌కు రేణుక చౌదరి విజ్ఞప్తి చేశారు.

Next Story