- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Thummala: కాంగ్రెస్ లో పదవులపై మంత్రి తుమ్మల ఇంట్రెస్టింగ్ కామెంట్స్
రాబోయే సర్పంచ్ ఎన్నికలపై మంత్రి తుమ్మల కామెంట్స్ చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: పార్టీలో పదవులపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageswara Rao) ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. పార్టీలో కష్టపడే వరికి తప్పకుండా పదవులు వస్తాయని, రాష్ట్రంలోని మంత్రివర్గంలో అన్ని వర్గాలకు స్థానం కల్పించినట్లు చెప్పారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం కాంగ్రెస్ ముఖ్యనాయకుల సమావేశానికి ఇవాళ ఆయన హాజరయ్యారు. ఈసందర్భంగా మాట్లాడిన తుమ్మల.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మండలంలోని అన్ని పంచాయతీలు కాంగ్రెస్ (Congress) పార్టీ కైవసం చేసుకోవాలని అది జరిగినప్పుడే మీరు మాకిచ్చిన పదవులుకు గుర్తింపు, మాకు ఆనందం అని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ పేదల కోసమే పుట్టిన పార్టీ అని అందుకే అధికారం లేకపోయినా ఈ పార్టీని పక్కన పెట్టాలని చెప్పే శక్తి ఎవరికి లేదన్నారు. రాహుల్ గాంధీ ఆలోచనతో రాష్ట్రంలో కులగణన చేపట్టామని, ఇప్పుడు మోడీ కులగణన చేయక తప్పడం లేదన్నారు.






