సీఎం కుర్చీ కోసం ఆ ఇద్దరు రెడ్లు వెయిటింగ్.. బాంబు పేల్చిన మాజీ డిప్యూటీ CM రాజయ్య

by Kema Shiva Kumar |

రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లపై రగడ.. మరోవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతోన్న వేళ మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య (Rajaiah) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

సీఎం కుర్చీ కోసం ఆ ఇద్దరు రెడ్లు వెయిటింగ్.. బాంబు పేల్చిన మాజీ డిప్యూటీ CM రాజయ్య
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లపై రగడ.. మరోవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతోన్న వేళ మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య (Rajaiah) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇవాళ హనుమకొండ (Hanumakonda)లో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Errabelli Dayakar Rao) ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాటికొండ రాజయ్య మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనపై ప్రజలకు పూర్తిగా నమ్మకం పోయిందని అన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేక ప్రభుత్వం చేతులెత్తేసిందని తెలిపారు. ఇక రేవంత్ రెడ్డి (Revanth Reddy) పాలనపై కాంగ్రెస్ అధిష్టానం ఏమాత్రం సంతృప్తిగా లేదన్నారు. ఆయనను అధిష్టానం పూర్తిగా పక్కన పెట్టేసిందని తెలిపారు. రేవంత్‌ను దిపింతే.. ఆ సీఎం కుర్చీలో కూర్చోవడానికి ఇద్దరు రెడ్డి నేతలు సిద్ధంగా ఉన్నారని బాంబు పేల్చారు. అందుకు సరైన ముహూర్తం కోసం వేచి చూస్తున్నారని, ఢిల్లీ వెళ్లి పార్టీ పెద్దలను కలుస్తున్నారని రాజయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Next Story