- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ponguleti Srinivas Reddy : ఆ మూడు పథకాలు పెద్ద స్కామ్ : మంత్రి పొంగులేటి శ్రీనివాస్
రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivas Reddy) మరోసారి బీఆర్ఎస్(BRS) పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivas Reddy) మరోసారి బీఆర్ఎస్(BRS) పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ములుగు పర్యటనలో ఉన్న ఆయన మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకు వచ్చిన మూడు పథకాలు పెద్ద స్కామ్ అని పేర్కొన్నారు. గులాబీ పార్టీ నాయకులు డబ్బా కొట్టుకుంటున్న కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleswaram Project), ధరణి(Dharani), మిషన్ భగీరథ(Mission Bhagiratha) పథకాలు భారీ మోసం అని, వీటిలో ఆ పార్టీ కీలక నేతలు ఇష్టారీతిన దండుకున్నారని మండిపడ్డారు.
ప్రాజెక్టుల పేరుతో పింక్ బలగాన్ని పెంచుకొని, ప్రజలపై దౌర్జన్యం చేశారని అన్నారు. తెలంగాణ జాతిపితను అని ప్రకటించుకున్న కేసీఆర్(KCR), నేడు విచారణ కమిషన్ ముందు నిలుచున్నారని ఎద్దేవా చేశారు. ఏ తప్పు చేయకపోతే ఈరోజు ఈ గతి ఎందుకు పడుతుంది అని ప్రశ్నించారు. తప్పు చేసినవారు ఎంతటి వాళ్ళైనా సరే వదిలే ప్రసక్తే లేడని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.






