- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
BJP: లోకల్ బాడీ ఎన్నికల నోటిఫికేషన్‍పై తెలంగాణ బీజేపీ రియాక్షన్ ఇదే
తెలంగాణలో లోకల్ బాడీ ఎన్నికలకు నగారా మోగింది.

దిశ, డైనమిక్ బ్యూరో: స్థానిక సంస్థల ఎన్నికల కోసం (Telangana local body elections) రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన నోటిఫికేషన్ షెడ్యూల్‍ను స్వాగతిస్తున్నామని బీజేపీ (BJP) స్టేట్ చీఫ్ రామచందర్ రావు అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై జీవో ఇవ్వాలని ప్రభుత్వానికి తాము మొదటి నుంచి చెబుతున్నామని కానీ ఇన్నాళ్లు నాటకాలు చేసిన ప్రభుత్వం ఇప్పుడు జీవో ద్వారానే ఎన్నికలకు వెళ్తోందని అన్నారు. ఇవాళ ఓ న్యూస్ చానల్ తో మాట్లాడిన ఆయన.. బీసీ బిల్లుల విషయంలో రాష్ట్రపతి, గవర్నర్ అంటూ కాలయాపన చేశారని విమర్శించారు. ఇప్పటికైనా జీవో తీసుకువచ్చారని దీన్ని తాము స్వాగతిస్తున్నామన్నారు. ఈ జీవోలో ముస్లింలకు 10 శాతం రిజర్వేషన్ల అంశం లేకపోవడం సంతోషకరం అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాటకాలను తాము వ్యతిరేకించాము తప్ప ఎక్కడా బీసీ బిల్లును వ్యతిరేకించలేదన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా ఎన్నికల ప్రక్రియ నిర్వహించాలన్నారు. తమ పార్టీకి అన్ని చోట్ల అభ్యర్థులు ఉన్నారని మిగతా పార్టీలకే అభ్యర్థులు లేరని అన్నారు.






