కాంగ్రెస్ ముందు తాము ఉంచిన ప్రతిపాదన ఇదే..! : సీపీఐ నారాయణ

by Disha Web Desk 4 |
కాంగ్రెస్ ముందు తాము ఉంచిన ప్రతిపాదన ఇదే..! : సీపీఐ నారాయణ
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో ఎన్నికలు పారదర్శకంగా జరపాలని ఎలక్షన్ కమిషన్‌కు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఫిర్యాదు చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం అనేక హామీలు గుప్పించి ఓటరును ప్రలోభ పెడుతుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎలక్షన్ సమయంలో లబ్ధిదారులకు వారి అకౌంట్‌లో డబ్బులు వేయటం ద్వారా ఓట్లు రాబట్టుకునేందుకు యత్నిస్తుందన్నారు. అధికార పార్టీకి అనుకూలమైన ఐఏఎస్ ఐపీఎస్ (పోలీసు రెవెన్యూ) శాఖకు సంబంధించిన అధికారులను ఇప్పటికే తమకు కావలసిన స్థానాలకు బదిలీ చేసుకోవడం జరిగిందన్నారు.

ఎన్నికలకు 6 నెలల ముందే ప్రభుత్వాలు వాగ్దానాలు ఇచ్చి అమలు చేసుకోవాలి. కానీ ఇందుకు విరుద్ధంగా తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ కంటే ముందుగానే ఇమ్మడి ముబ్బడిగా పథకాలను అధికారులను బదలాయింపు చేస్తూ మోసం చేస్తుందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి తమకు రాజకీయ అవగాహన కుదిరింది తప్ప సీట్ల అవగాహన కుదరలేదన్నారు. సీపీఐ ఐదు స్థానాలు సీపీఎం 5 స్థానాల కోసం ప్రతిపాదనలు పెట్టామన్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున కార్గే సీనియర్ నేతలు వేణుగోపాల చారి రాష్ట్ర నాయకత్వంతో ఇదివరకు సంప్రదింపులు జరిపామన్నారు.

రాష్ట్రస్థాయి నుంచి ఢిల్లీ స్థాయిల వరకు మా యొక్క ప్రతిపాదనల గురించి బలంగా వినిపించామన్నారు. కాంగ్రెస్ పార్టీ స్క్రీనింగ్ సమావేశం జరుగుతుంది త్వరలో కాంగ్రెస్ పార్టీ విడుదల చేస్తే స్థానాల లిస్టులో తమ పార్టీవి కూడా ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. కమ్యూనిస్టు పార్టీలు కేవలం పోరాటాలే కాకుండా చట్టసభల్లో నాయకత్వం ఉండటానికి తాము నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఇందులో భాగంగానే తాము చలో ఐదు సీట్లను కావాలని ప్రతిపాదించాము.

త్వరలో జరిగే 5 రాష్టల శాసనసభ ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీలు కలిసి పోటీ చేయడానికి నిర్ణయించుకున్నాయన్నారు. ఛత్తీస్ గఢ్‌లో సీపీఐ 14 నుంచి 15 స్థానాలు అదేవిధంగా లెఫ్ట్ ఓరియంటెడ్ పార్టీలతో కలిసి 40 నుంచి 40 స్థానాల్లో పోటీ చేస్తామన్నారు. మధ్యప్రదేశ్లో సీపీఐ 15 సీపీఎం 14 స్థానాలు అదేవిధంగా రాజస్థాన్‌లో 14, 15 స్థానాల్లో పోటీ చేస్తామని ఆయన వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఇండియా కూటమిలో భాగంగా బీజేపీకి వ్యతిరేకంగా పోరాడాలని కమ్యూనిస్టు పార్టీ నిర్ణయించిందన్నారు. ఇందులో భాగంగా ఆయా రాష్ట్రాల్లో బలంగా ఉన్న స్థానాల్లో కమ్యూనిస్టులు పోరాడాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. కొన్నిచోట్ల అవగాహన లేదా ఒప్పందం మేరకు పోటీ చేస్తామన్నారు.


Next Story

Most Viewed